టాప్ 100 ఎయిర్‌పోర్ట్స్‌లో మనవేవో తెలుసా?
ప్రపంచంలో టాప్ 100 అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్స్ జాబితాని స్కైట్రాక్స్ అనే సంస్థ విడుదల చేసింది. అందులో మన దేశానికి చెందిన నాలుగు ఎయిర్‌పోర్టులున్నాయి. అవేవంటే....
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, దిల్లీ
స్కైట్రాక్స్ అత్యుత్తమ 100 ఎయిర్‌పోర్టుల జాబితాలో దిల్లీ ఎయిర్‌పోర్ట్ 36వ స్థానంలో నిలిచింది.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ది 65వ స్థానం.
కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు
ఈ ఎయిర్‌పోర్టు 69వ స్థానంలో ఉంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ముంబయి
దేశ ఆర్థిక రాజధానిలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ స్కైట్రాక్స్ జాబితాలో 84వ స్థానంలో నిలిచింది.
టాప్ 100 జాబితాలో టాప్ 10 ఎయిర్‌పోర్ట్‌లు ఇవే..
1. ఛాంగి ఎయిర్‌పోర్ట్
సింగపూర్
2. హమద్ ఎయిర్‌పోర్ట్
దోహా, ఖతర్
3. హనీదా ఎయిర్‌పోర్ట్
టోక్యో, జపాన్
4. ఇన్చెయాన్ ఎయిర్‌పోర్ట్
సియోల్, దక్షిణ కొరియా
5. చార్లెస్ డి గలే ఎయిర్‌పోర్ట్
పారిస్, ఫ్రాన్స్
6. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్,
తుర్కియో
7. మ్యూనిక్ ఎయిర్‌పోర్ట్,
జర్మనీ
8. జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్,
స్విట్జర్లాండ్
9. నరీతా ఎయిర్‌పోర్ట్,
టోక్యో, జపాన్
10. బరాజస్ ఎయిర్‌పోర్ట్,
మాడ్రిడ్, స్పెయిన్