టీ20ల్లో భారత క్రికెటర్ల అత్యధిక స్కోర్లివే

విరాట్ కోహ్లీ


విరాట్ కోహ్లీ (122*) స్కోరుతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 2022 ఆసియా కప్‌ సూపర్‌ 4లో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ స్కోరు నమోదు చేశాడు. టీ20ల్లో అతడికిదే తొలి శతకం కావడం గమనార్హం.

Image:Eenadu

రోహిత్‌ శర్మ 


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (118) రెండో స్థానంలో ఉన్నాడు. డిసెంబరు 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 43 బంతుల్లోనే 118 పరుగులు చేశాడు.

Image:Eenadu

సూర్యకుమార్‌ యాదవ్‌ 


సూర్యకుమార్‌ యాదవ్‌ 117 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. జులై 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు చేశాడు.

Image:Eenadu

రోహిత్‌ శర్మ 


ఈ జాబితాలో రోహిత్‌ శర్మ మరోసారి చోటు దక్కించుకున్నాడు. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Image:Eenadu

కేఎల్‌ రాహుల్‌ 


టీ20ల్లో కేఎల్‌ రాహుల్‌ అత్యధిక స్కోరు (110*). విండీస్‌తో 2016లో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లోనే ఈ స్కోరు చేశాడు.

Image:Eenadu

రోహిత్‌ శర్మ


రోహిత్‌ ఈ జాబితాలో మరోసారి చోటు దక్కించుకున్నాడు. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 106 పరుగులు చేశాడు.

Image:Eenadu

దీపక్‌ హుడా 


టీ20ల్లో దీపక్‌ హుడా అత్యధిక స్కోరు 104. జూన్‌ 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హుడా 57 బంతుల్లో ఈ సెంచరీ కొట్టాడు.

Image:Eenadu

కేఎల్ రాహుల్‌ 

 

కేఎల్ రాహుల్‌ ఈ జాబితాలో రెండోసారీ చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో 2016లో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 51 బంతుల్లో ఈ స్కోరు నమోదు చేశాడు.

Image:Eenadu

సురేశ్ రైనా 


టీ20ల్లో భారత మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా అత్యధిక స్కోరు 101. ఇంగ్లాండ్‌తో 2010లో జరిగిన మ్యాచ్‌లో రైనా 60 బంతుల్లో ఈ స్కోరును అందుకున్నాడు.

Image:Eenadu

రోహిత్‌ శర్మ


రోహిత్‌ నాలుగోసారీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. జులై 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

Image:Eenadu

సఫారీలతో టీ20 సమరం

భారత్‌Xదక్షిణాఫ్రికా.. ఏ మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ?

‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ రికార్డులు తెలుసా?

Eenadu.net Home