తొలి బంతికే వికెట్‌.. ఆ కిక్కే వేరబ్బా..

క్రికెట్‌లో బౌలర్ల వేట.. వికెట్ల కోసమే. ఎన్ని వికెట్లు తీసినా.. మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీస్తే ఆ కిక్కే వేరు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సిరాజ్‌ అలా తొలి బంతికే వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు వన్డేల్లో ఈ ఫీట్‌ సాధించిన మన బౌలర్లు ఎవరో చూద్దాం.. 

దెబాషిశ్‌ మొహంతి

1999లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్‌ వికెట్‌ పడగొట్టాడు.

జహీన్‌ ఖాన్‌

2001లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జహీర్‌ సిన్‌క్లెయిన్‌ వికెట్‌ తీశారు.

జహీర్‌ ఖాన్‌

2002లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో తొలి బంతికే శ్రీలంక బ్యాటర్‌ జయసూర్య వికెట్‌ పడగొట్టాడు.

జహీర్‌ ఖాన్‌

2007లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మైఖేల్‌ క్లర్క్‌ను పెవిలియన్‌కు పంపించాడు.

జహీర్‌ ఖాన్‌

2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తరంగను ఔట్‌ చేశాడు.

ప్రవీణ్‌ కుమార్‌

2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్‌ కూడా తొలి బంతికి తరంగ వికెటే తీశాడు.

మొహమ్మద్‌ సిరాజ్‌

2024.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో సిరాజ్‌ నిసంకను వికెట్‌ పడగొట్టాడు.

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home