బ్రిటీష్‌ చిత్రాల్లో ‘భారతీయ’ చరిత్ర

ముంబయి వేదికగా జరిగిన ‘డియో’ ఫ్యాషన్‌ షోలో పలువురు సినీ తారలు పాల్గొన్నారు. అందులో భారత సంతతి బ్రిటీష్‌ నటి చరిత్ర చంద్రన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Image: Instagram/Charithra Chandran

గేట్‌ వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించిన ఈ షోలో చరిత్ర.. నలుపు రంగు దుస్తుల్లో తళుక్కుమంది.

Image: Instagram/Charithra Chandran

చరిత్ర చంద్రన్‌ 1997 జనవరి 17న స్కాట్లాండ్‌లో జన్మించింది. తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. ఈమె రెండేళ్ల వయసులోనే వారిద్దరూ విడిపోవడంతో తండ్రితోపాటు భారత్‌కు వచ్చేసింది. 

Image: Instagram/Charithra Chandran

నాలుగేళ్ల వయసులో తండ్రితోపాటు యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడింది. అక్కడే ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Image: Instagram/Charithra Chandran

నటనపై ఆసక్తితో నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో చేరింది. కొన్నాళ్లు ఉద్యోగం చేస్తూనే పలు నాటకాల్లో పాల్గొంది. ఆ తర్వాత ఉద్యోగం మానేసి నటననే కెరీర్‌గా ఎంచుకుంది.

Image: Instagram/Charithra Chandran

తొలిసారిగా 2021లో వచ్చిన అమెజాన్‌ స్పై థ్రిల్లర్‌ ‘అలెక్స్‌ రైడర్‌’లో నటించింది. తన నటనకు మంచి గుర్తింపు లభించడమే కాదు.. అవకాశాలూ దక్కాయి. 

Image: Instagram/Charithra Chandran

గతేడాది ఈ భామ.. ‘బ్రిడ్జర్టన్‌’ వెబ్‌సిరీస్‌తోపాటు ‘ది టేల్స్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో, ‘కాస్ల్‌ ఎస్‌’ చిత్రంలో నటించింది. 

Image: Instagram/Charithra Chandran

ప్రస్తుతం ఆమె మరో రెండు వెబ్‌సిరీస్‌లు, ఓ సినిమాలో నటిస్తోంది. పలు ఆడియో ఆల్బమ్స్‌లోనూ చరిత్ర.. తన స్వరం వినిపించింది. 

Image: Instagram/Charithra Chandran

బ్రిటన్‌ సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదుగుతున్నా.. తన మూలాలు మర్చిపోలేదు చరిత్ర. గతేడాది నవంబర్‌లో ఈమె తమిళనాడులోని తంజావూరుకి వచ్చి అక్కడి ఐరవటేశ్వర ఆలయాన్ని సందర్శించింది.

Image: Instagram/Charithra Chandran

బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ సినిమాల్లోని రొమాంటిక్‌ సన్నివేశాలు చరిత్రకు బాగా నచ్చాయట. రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌, హృతిక్‌ రోషన్‌ నటన అంటే ఇష్టమని ఓ సందర్భంలో చెప్పింది.

Image: Instagram/Charithra Chandran

తను కాస్త రంగు తక్కువ ఉండటంతో స్నేహితులు, సన్నిహితులు కూడా అవహేళన చేసేవారట. అవన్నీ దాటుకొని స్టార్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. తనలాంటి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Image: Instagram/Charithra Chandran

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home