వెండితెరపై మెరిసిన టీమ్‌ఇండియా క్రికెటర్స్‌.. 

టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్ ధావన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’లో అతిథి పాత్రలో నటించాడు. మరి ధావన్‌ కంటే ముందు సినిమాల్లో నటించిన భారత క్రికెటర్లెవరో ఓ లుక్కేద్దాం. 

Image:Eenadu

భారత మాజీ బ్యాటర్‌ వినోద్‌ కాంబ్లీ 1991 నుంచి 2000 వరకు భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా క్రికెట్‌కు దూరమైన కాంబ్లీ 2002లో విడుదలైన ‘అనర్థ్‌’ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. 

Image:Eenadu

భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కపిల్ దేవ్‌ పలు సినిమాల్లో కనిపించారు. ‘ఇక్బాల్‌’, ‘ముజ్‌సే షాదీ కరోగీ’, ‘చెయిన్‌ కులీకి మే కులీ’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు.

Image:Eenadu

భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ‘విక్టరీ’, ‘ముజ్‌సే షాదీ కరోగీ’, ‘ఫ్రెండ్‌షిప్‌’, ‘డిక్కిలోనా’తోపాటు మరో రెండు సినిమాల్లో నటించారు. 

Image:Eenadu 

భారత మాజీ ఆటగాడు నవజ్యోత్‌ సింగ్‌ పలు టీవీ షోల్లో పాల్గొంటూనే ‘ముజ్‌సే షాదీ కరోగీ’, ‘విక్టరీ’, ‘మేరా పింద్‌’ వంటి చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు.

Image:SocialMedia

టీమ్‌ఇండియాకు 1992-2000 మధ్య సేవలందించిన అజయ్‌ జడేజా 2003లో ‘ఖేల్‌’ అనే చిత్రంలో నటించారు.

Image:Eenadu  

సునీల్‌ గవాస్కర్‌ క్రికెటర్‌గా తన కెరీర్‌ ముగిసిన తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. మరాఠీ చిత్రం ‘సావ్లీ ప్రేమాచి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం.

Image:Eenadu  

ఇటీవల విడుదలైన విక్రమ్‌ ‘కోబ్రా’లో భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించారు. ‘ముజ్‌సే షాదీ కరోగీ’లో అథితి పాత్రలో కనిపించారు.

Image:Eenadu

భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ ‘అక్సర్‌-2’, ‘క్యాబరెట్‌’, ‘టీమ్‌ 5’ తదితర చిత్రాల్లో నటించారు. 

Image:Eenadu 

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home