2024.. రిటైరైన భారత క్రికెటర్లు వీరే

మరికొన్ని రోజుల్లో 2024 ఇన్నింగ్స్‌ ముగించేసి.. 2025 ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాం. ఈ ఏడాది కొందరు టీమ్‌ ఇండియా క్రికెటర్లు మొత్తంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ను వదిలేయగా.. మరికొందరు కేవలం ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. వాళ్లెవరో చూద్దాం! 

రవిచంద్రన్ అశ్విన్ 


ఇటీవల భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 

విరాట్ కోహ్లీ 


2024 టీ20 ప్రపంచ కప్ అనంతరం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. విరాట్ భారత్ తరఫున 125 టీ20లు ఆడి 4188 రన్స్‌ చేశాడు.

రోహిత్ శర్మ 


భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ సాధించిన అనంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పాడు. హిట్‌మ్యాన్ టీమ్‌ఇండియా తరఫున 159 మ్యాచ్‌లు ఆడి 4231 పరుగులు సాధించాడు.

రవీంద్ర జడేజా 


భారత్ తరఫున 74 టీ20లు ఆడిన ఆల్‌రౌండర్ జడేజా.. 515 రన్స్‌, 54 వికెట్లు పడగొట్టాడు. 2024 పొట్టి ప్రపంచ కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

శిఖర్ ధావన్ 


భారత ఓపెనర్‌గా ఓ వెలుగు వెలిగిన శిఖర్ ధావన్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

దినేశ్‌ కార్తిక్ 


భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడిన వికెట్‌ కీపర్ దినేశ్‌ కార్తిక్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌తోపాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

కేదార్ జాదవ్


బ్యాటర్ ఆల్‌రౌండర్‌ కేదార్ జాదవ్ 73 వన్డేలు, టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2024 జూన్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

వృద్ధిమాన్ సాహా


40 టెస్టులు, 9 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

సౌరభ్ తివారీ 


భారత్ తరఫున మూడు వన్డేలు ఆడిన బ్యాటర్‌ సౌరభ్‌ తివారీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

వరుణ్ ఆరోన్


టీమ్ఇండియా తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన ఫాస్ట్‌బౌలర్‌ వరుణ్‌ ఆరోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

బరిందర్ శ్రణ్‌


భారత్ తరఫున 6 వన్డేలు, 2 టీ20లు ఆడిన ఫాస్ట్‌ బౌలర్ బరిందర్ శ్రణ్‌ ఈ ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు. 

సిద్ధార్థ్‌ కౌల్ 


భారత్ తరఫున మూడేసి వన్డేలు, టీ20లు ఆడిన పేసర్ సిద్ధార్థ్‌ కౌల్‌ ఈ ఏడాది భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

విదేశీ లీగ్‌ల్లో మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. 

ఆసీస్‌పై ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ.. పంత్ ప్రపంచ రికార్డు

సిడ్నీలో ఇప్పటివరకు ఏం జరిగింది? ఎవరు బాగా ఆడారు?

టీమ్‌ ఇండియా సిరీస్‌లు @ 2025

Eenadu.net Home