హాలీవుడ్‌లో భారత సంతతి తారల్ని చూశారా!

ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వంటి భారతీయ నటీమణులు హాలీవుడ్‌లో రాణిస్తున్నారు. కానీ, విదేశాల్లోనే పుట్టి పెరిగిన కొందరు భారత సంతతి వ్యక్తులు ఎప్పటి నుంచో హాలీవుడ్‌లో నటిస్తున్నారు. వారిలో అందమైన తారలు వీళ్లు..!

Image: Instagram

నెయోమీ స్కాట్‌

ఇండో అమెరికన్‌ అయిన నెయోమీ స్కాట్‌.. తండ్రి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కాగా.. తల్లి గుజరాత్‌ మూలాలున్న భారత సంతతి వ్యక్తి. నెయోమీ.. ‘పవర్‌ రేంజర్స్‌’, ‘అలాద్దీన్‌’ తదితర చిత్రాల్లో నటించింది. ఈ భామ మంచి సింగర్‌ కూడా. 

Image: Instagram

హన్నా సిమోన్‌

ఈ హాలీవుడ్‌ సుందరి తల్లి బ్రిటన్‌కు చెందిన వ్యక్తి. తండ్రి భారతీయుడు. ఎక్కువగా టీవీ షోల్లో నటించే హన్నా.. ‘ఫ్లక్‌ ఆఫ్‌ డ్యూడ్స్‌’, ‘బ్యాండ్‌ ఎయిడ్‌’, ‘కిల్లింగ్‌ గంతర్‌’ తదితర చిత్రాల్లో నటించింది. 

Image: Instagram

ఆర్చీ పంజాబీ

ఈ 50 ఏళ్ల తార.. చాలా కాలంగా హాలీవుడ్‌లో నటిస్తోంది. వీరి తల్లిదండ్రులిద్దరూ భారతీయులే. బ్రిటన్‌కు వలసవెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన ఆర్చీ.. మొదట్లో బ్రిటన్‌లోనే టీవీ షోలు, షార్ట్‌ఫిల్మ్స్‌ చేసి.. ఆ తర్వాత హాలీవుడ్‌లో రాణిస్తోంది. 

Image: Instagram

నోరా జోన్స్‌ శంకర్‌

సంగీత విద్వాంసుడు రవిశంకర్‌.. ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాత, నటి సూయి జోన్స్‌ కుమార్తెనే నోరా జోన్స్‌. న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన నోరా.. గాయనిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. పలు హాలీవుడ్‌ సినిమాల్లో, టీవీ షోల్లోనూ మెరిసింది. 

Image: Instagram

కుహూ వర్మ

ఈమె అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత్‌కు చెందిన దంపతుల కుమార్తె. హాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ‘ప్లాన్‌ బి’, ‘మర్డర్‌ మిస్టరీ 2’, ‘స్పేస్‌ కెడిట్‌’ తదితర చిత్రాల్లో నటించింది.

Image: Instagram

వీర మిండీ చోకలింగమ్‌

అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో భారత్‌కు చెందిన దంపతులకు జన్మించిందీమె. 2005 నుంచి అమెరికన్‌ టీవీ షోలు, సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మిండీ ‘వెల్మా’ అనే టీవీ షోలో నటించడంతోపాటు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

Image: Instagram

ఇందిరా వర్మ

ఈమె తండ్రి భారత్‌కు చెందిన వ్యక్తి కాగా.. తల్లి స్విట్జర్లాండ్‌ పౌరురాలు. ‘కామసూత్ర: ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’తో వెండితెరకు పరిచయమైన ఇందిరా.. హాలీవుడ్‌తోపాటు పాకిస్థాన్‌, బ్రిటన్‌ సినిమాల్లోనూ నటించింది.

Image: Instagram

నోరీన్‌ డి వూల్ఫ్

పుణెకు చెందిన ముస్లిం దంపతులకు న్యూయార్క్‌లో జన్మించింది నోరీన్‌. ఆస్కార్‌ గెలిచిన ‘వెస్ట్‌ బ్యాంక్‌ స్టోరీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో కెరీర్‌ ప్రారంభించింది. టీవీషోలు, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram

రోనా మిత్ర

లండన్‌లోని పాడింగ్టన్‌లో జన్మించింది రోనా. తల్లి ఐర్లాండ్‌ పౌరురాలు కాగా.. తండ్రి బెంగాలీ. బ్రిటన్‌ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చిన రోనా.. 1995 నుంచి టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం మూడు సినిమాలతోపాటు మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. 

Image: Instagram

మెలానీ చంద్ర

మెలానీ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ కేరళకు చెందినవారే. 2010లో ‘బైసైకిల్‌ బ్రైడ్‌’ చిత్రంతో సినీ కెరీర్‌ మొదలుపెట్టింది. తెలుగులో ‘డి ఫర్‌ దోపిడీ’లో నటించింది. 

Image: Instagram

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

Eenadu.net Home