ఫ్రీడమ్ 125.. ప్రపంచంలోనే తొలి CNG బైక్
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీఎన్‌జీ బైక్‌ను బజాజ్ ఆటో జులై 5న లాంచ్ చేసింది.
సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌తో తీసుకురావడం విశేషం.
ఫ్రీడమ్ డిస్క్ ఎల్‌ఈడీ, డ్రమ్ ఎల్‌ఈడీ, డ్రమ్.. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది.
డిస్క్ ఎల్‌ఈడీ వేరియంట్ ధర రూ.1.10 లక్షలు(ఎక్స్‌షోరూమ్), డ్రమ్ ఎల్‌ఈడీ 1.05 లక్షలు, డ్రమ్ వేరియంట్ ధర రూ.95వేలకే అందిస్తోంది.
125 సీసీ ఇంజిన్, 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది.
సీఎన్‌జీ 2 కేజీలకు 200 కిలోమీటర్లు, పెట్రోల్ రెండు లీటర్లకు 130 కిలోమీటర్లు కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీపై టాప్‌స్పీడ్ గంటకు 90.5 కిలోమీటర్ల, పెట్రోల్‌పై 93.4 కిలోమీటర్లు వెళుతుంది.
బైక్‌ను ఆపకుండానే ఫ్యూయెల్ ఆప్షన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
బైక్ బుకింగ్‌లు బజాబ్ ఆటో వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో తక్షణమే తీసుకొస్తామని, ఇతర రాష్ట్రాల్లో దశలవారీగా ఈ బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.