ఇండోర్ ప్లాంట్స్‌.. ప్రయోజనాలు ఇవే!



చుట్టూ పచ్చదనం అల్లుకొని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! ఆ ప్రదేశాన్ని వదిలి రావాలనిపించదు! మరి మనం ఉండే చోటుని కూడా అలా పచ్చదనంతో నింపేస్తే బాగుంటుందో కదా!

image:pixabay



అందరూ ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటారు. అందుకు ఇండోర్‌ ప్లాంట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. చూడడానికి అందంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. 

image:pixabay



ఒంటరిగా ఉన్నా, ఏదైనా డిప్రెషన్‌లో ఉన్నా కాసేపు మొక్కలతో సమయం గడపండి. వాటికి నీళ్లు పట్టడం, కొత్త మొక్కలు నాటడం వంటి పనులతో తేలికపడచ్చు.

image:pixabay



ఇండోర్‌ ప్లాంట్స్‌తో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇంట్లో ఆక్సీజన్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసే మొక్కలను పెంచుకోండి. పని చేసే చోట కూడా వీటిని పెంచొచ్చు. 

image:pixabay



చుట్టూ మొక్కలతో ఆహ్లాదకరంగా ఉంటే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీంతో ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది.

image:pixabay

తరచూ పచ్చదనాన్ని చూస్తూ ఉంటే కంటిచూపు మెరుగవుతుందట! అందుకే ఇంట్లో ఎక్కువగా మొక్కల్ని పెంచండి. 

image:pixabay



కలబంద, కొత్తిమీర, పుదీనా మొక్కల్ని పెంచడం వల్ల వంటల్లోనూ వాడుకోవచ్చు. తులసీ మొక్క పెంచుకుంటే ఔషధంగా కూడా పని చేస్తుంది.

image:pixabay



స్నేక్‌ ప్లాంట్‌, జాడే ప్లాంట్స్, ప్లామ్‌ జాతి మొక్కలు, స్పైడర్‌ ప్లాంట్స్, బాంబో మొక్కలు, యూకలిప్టస్‌ మొక్కలు ఇంట్లో పెంచుకునేందుకు అనువుగా ఉంటాయి. గాలిని శుద్ధీకరిస్తాయి.

 image:pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home