చదివింది ‘లా’.. నటనతో ఆకట్టుకునేలా!
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెదకాపు 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతోంది ప్రగతి శ్రీవాస్తవ. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..
ఈ ముద్దుగుమ్మ ‘మనుచరిత్ర’ (2023)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు చదువుకొనసాగిస్తూనే నటించింది.
దిల్లీకి చెందిన ప్రగతి ‘లా’, పబ్లిక్ పాలసీ స్టూడెంట్. నటనపై ఆసక్తితో టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ చేసేది. కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఓ యాడ్ వల్ల సినిమా అవకాశం వచ్చిందని ఓ సందర్భంలో తెలిపింది.
సినిమాల్లోకి వెళ్తానంటే ప్రగతి కుటుంబం నో చెప్పింది. దాంతో, రెండు రోజులు ఏడ్చింది. సినిమాకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేశానని చెప్పడంతో చివరకు తన తండ్రి అంగీకరించక తప్పలేదు.
‘‘నాన్న తెరపై నన్నెప్పుడు చూసినా గర్వపడేలా ఉండాలనుకుంటా. ఆయనకు ఇష్టంలేని పాత్రను ఎప్పటికీ చేయను’’ అని ప్రగతి చెబుతుంది.
తొలి సినిమాలో జానకీ పటేల్ అలియాస్ ‘జాను’గా నటించి ఆకట్టుకుంది. ఇతరుల్లానే తానూ ‘పెదకాపు 1’కి అడిషన్ ఇచ్చి హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబరు 29న విడుదల కానుంది.
ఫస్ట్ మూవీ రిలీజ్‌కాక ముందే ‘పెదకాపు 1’, ‘గం గం గణేశా’ (ఆనంద్ దేవరకొండ హీరో) చిత్రాల్లో కథానాయికగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేయడం విశేషం.
సమంత, త్రిష నటన, తాప్సి కథల ఎంపిక అంటే ప్రగతికి ఇష్టం.
ప్రభాస్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లతో కలిసి నటించాలనేది ఆమె కోరిక. లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకూ సిద్ధమే అంటోంది.