మార్కెట్లోకి ఇన్ఫినిక్స్‌ 4జీ.. 5జీ ఫోన్లు!

తాజాగా ఇన్ఫినిక్స్‌ 4జీ, 5జీ వేరియంట్లలో రెండు కొత్త మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటి వివరాలివీ..!

Image: Infinix

ఇన్ఫినిక్స్‌ జీరో అల్ట్రా 5జీ

ఈ మొబైల్‌లో 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ కర్వ్‌డ్‌ 3డీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌. 

Image: Infinix

ఇందులో ఆక్టాకోర్‌ 6ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను వాడారు. 8 జీబీ ర్యామ్‌ ఉంది. దీన్ని 13 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. మైక్రో ఎస్డీతో 2టీబీ వరకు పెంచుకోవచ్చు. 

Image: Infinix

వెనుకవైపు 200 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Infinix

ఈ మొబైల్‌లో 180 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 12 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని సంస్థ చెబుతోంది. ధర రూ. 29,999. డిసెంబర్‌ 25 నుంచి విక్రయాలు మొదలవుతాయి. 

Image: Infinix

ఇన్ఫినిక్స్‌ జీరో 20

ఈ మొబైల్‌ 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది.

Image: Infinix

మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ను వినియోగించారు. 8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లున్నాయి. 

Image: Infinix

ఈ 4జీ మొబైల్‌లో వెనుకవైపు 108 + 13 + 2 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 60 ఎంపీ కెమెరా అమర్చారు. 

Image: Infinix

ఇందులో 44 వట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 29 నుంచి విక్రయాలు మొదలవుతాయి.  

Image: Infinix

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home