108 ఎంపీ కెమెరాతో.. ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 12 ప్రో!

ఇన్ఫీనిక్స్‌ నోట్‌ 12 ప్రోలో 60 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ట్రూ కలర్‌ అమోలెడ్‌ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో వాటర్‌-డ్రాప్‌ నాచ్‌ ఉంది.

Image: Infinix

మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ వాడారు. భారత్‌లో ఈ ప్రాసెసర్‌తో వస్తోన్న తొలి మొబైల్‌ ఇదే కావడం విశేషం.

Image: Infinix

ఇందులో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Infinix

మొబైల్‌లో 8జీబీ ర్యామ్‌ ఉండగా.. దాన్ని వర్చువల్‌గా 13జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉండగా మైక్రో ఎస్డీతో 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Infinix

వెనుకవైపు 108ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, ఏఐ లెన్స్‌ ఉన్నాయి. ముందువైపు 16ఎంపీ కెమెరా ఉంది.

Image: Infinix

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 10.6తో పనిచేసే ఈ మొబైల్‌లో డీటీఎస్‌ను సపోర్ట్‌ చేసే డ్యూయల్‌ స్పీకర్స్‌ ఉన్నాయి.

Image: Infinix

గ్రే, బ్లూ, వైట్‌ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 16,999గా సంస్థ నిర్ణయించింది.

Image: Infinix

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Image: Flipkart

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home