ఐపీఎల్‌: గాయాలపాలవుతున్న ఆటగాళ్లు!

ఈ ఏడాది ఐపీఎల్‌లో గాయాలబారిన పడుతున్న ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. టోర్నీకి ముందే కొందరు దూరమవ్వగా.. ఇప్పుడు మరికొంతమంది గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ 2023లో గాయపడ్డ ఆటగాళ్లు వీళ్లే!

Image: Twitter

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌, దక్షిణాఫ్రికాకు చెందిన సిసండా మగాలా తాజాగా గాయపడ్డాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా మగాలా కుడి చేతి వేళ్లకు దెబ్బ తగిలింది. దీంతో మ్యాచ్‌కే కాదు, రెండు వారాలపాటు ఆటకు దూరమయ్యాడు. 

Image: Twitter

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గాయంతోనే రాజస్థాన్‌ మ్యాచ్‌లో ఆడాడు. నొప్పి తీవ్రమైతే తదుపరి మ్యాచ్‌ల్లో ఆడటం కష్టమేనని సమాచారం.

Image: Twitter

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. ఒక్క ఓవరే వేసి... తొడ కండరాలు పట్టేయడంతో ఆటకు దూరమయ్యాడు. మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడకపోవచ్చు.

Image: Twitter

చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీకి వెళ్లే బంతిని ఆపే ప్రయత్నంలో గుజరాత్‌ టైటన్స్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ కిందపడ్డాడు. మోకాలు నేలకు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Image: Twitter

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫాస్ట్‌ బౌలర్‌ రీస్‌ టాప్లీ తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ముంబయితో మ్యాచ్‌లో బంతిని ఆపేందుకు డైవ్‌ చేశాడు. దీంతో అతడి కుడి భుజం స్థానభ్రంశం చెందింది. విశ్రాంతి నిమిత్తం స్వదేశానికి వెళ్లిపోయాడు.

Image: Twitter

చెన్నై ఆటగాడు.. బెన్‌ స్టోక్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ముంబయితో మ్యాచ్‌లో కనిపించలేదు. ప్రాక్టీస్‌లో గాయపడ్డాడని సమాచారం. మరికొన్ని రోజులపాటు అతడికి విశ్రాంతి అవసరం కావడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

Image: Twitter

బుమ్రా, రిచర్డ్సన్‌, రిషభ్‌ పంత్‌, బెయిర్‌ స్టో , కైల్‌ జేమిసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, హెజిల్‌వుడ్‌, తదితరులు గాయాల కారణంగా మొత్తం టోర్నీకే దూరమయ్యారు.

Image: Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home