MWC ఆవిష్కరణలు ఇవే!

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ఈవెంట్‌ 2024 స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు జరిగింది. టెక్‌ కంపెనీలు AI సాంకేతికతో రూపొందించిన వస్తువులు, స్మార్ట్‌ఫోన్లు, కొత్త ఆవిష్కరణల్ని ఈ ఈవెంట్‌లో లాంచ్‌ చేశారు. ఆ విశేషాలివీ..

photo courtesy: © 2024 GSMA / MWC

This browser does not support the video element.

రోలబుల్‌ డిస్‌ప్లేతో స్పీకర్‌

రోలబుల్‌ డిస్‌ప్లేతో ఏఐ స్మార్ట్‌ స్పీకర్‌ను శాంసంగ్‌ ఆవిష్కరించింది. ఆటోమేటిక్‌గా డిస్‌ప్లేను రోల్‌ చేయగల ఈ స్పీకర్‌ టెక్‌ నిపుణుల్ని ఆకట్టుకుంది.

#iamHaneetTwitter

మడతపెట్టే ఫోన్‌

మడతపెట్టే కొత్త కాన్సెప్ట్‌ మొబైల్‌ను మోటోరొలా ప్రదర్శించింది. దీన్ని చేతికి బ్రేస్‌లెట్‌ వేసుకున్నట్లుగా మణికట్టుకు చుట్టొచ్చు.

This browser does not support the video element.

రోలబుల్‌ ఫోన్‌

ఫాంటమ్‌ అల్టిమేట్‌ పేరుతో రోలబుల్‌ డిస్‌ప్లే కలిగిన కాన్సెప్ట్‌ ఫోన్‌ను టెక్నో ప్రదర్శించింది. బటన్‌ సాయంతో ఈజీగా ఫోన్‌ రోల్‌ అవుతుంది.

#BenGeskinTwitter

శాంసంగ్‌ స్మార్ట్‌ రింగ్‌

వివిధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్న శాంసంగ్‌ స్మార్ట్‌రింగ్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎండబ్ల్యూసీ వేదికగా తన స్మార్ట్‌ రింగ్‌ను ప్రదర్శించింది.

This browser does not support the video element.

కంటితో ఆపరేట్‌ చేసేయొచ్చు

మ్యాజిక్‌ 6ప్రో స్మార్ట్‌ఫోన్‌ను హానర్‌ ప్రదర్శించింది. అందులో ఉన్న ఏఐ సాంకేతిక ద్వారా కంటితోనే ఫోన్‌ ఆపరేట్‌ చేసేయొచ్చు.

#KarlConradTwitter

యాప్‌ లెస్‌ ఫోన్‌

డాయిషే టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఎలాంటి యాప్‌లు అవసరం లేని స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించింది.

#Deutsche Telekom

This browser does not support the video element.

స్మార్ట్ పిన్‌

స్మార్ట్‌ఫోన్‌ తరహాలో అన్ని పనులూ చేయగలిగే బుల్లి డివైజ్‌ను యాపిల్‌ మాజీ ఉద్యోగులు రూపొందించారు. దీన్ని షర్ట్‌కు సులువుగా ధరించొచ్చు.

#sweetenedcafeTwitter

ట్రాన్స్‌పరెంట్‌ డిస్‌ప్లే లాప్‌ట్యాప్‌

ట్రాన్స్‌పరెంట్‌ డిస్‌ప్లేతో లెనోవా లాప్‌ట్యాప్‌ను ఆవిష్కరించింది. ఇది 17.3 అంగుళాల తెరతో వస్తోంది.

This browser does not support the video element.

ఎయిర్‌ గ్లాస్‌

ఏఐ సాంకేతికతతో ఒప్పో ఎయిర్‌ గ్లాస్‌ను ఆవిష్కరించింది. దీన్ని మాటలతో ఆపరేట్‌ చేస్తే సమాధానం వెంటనే కనిపిస్తుంది.

#oppoTwitter

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

హ్యాకర్స్‌లో.. వైట్‌, బ్లాక్‌, గ్రే... తెలుసా?

IRCTCలో ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home