#eenadu

ఏ ప్రాణిని గాని జీవిని గాని గాయపరచకూడదు. అణిచివేయడం, బానిసలుగా చూడడం, హింసించడం, అవమానించడం వంటివి అస్సలు చేయకూడదు. 

అనవసరంగా డబ్బును కూడబెట్టకూడదు. మనం ఎంత కూడబెట్టినా అది చివరకు సమాజానికే చెందుతుంది.

మన కోపం అవతలి వారిని బాధించడంతో పాటు కోపాన్నీ తెప్పిస్తుంది. క్షమించే గుణం ఉంటే ప్రేమతో మరింత దగ్గరవ్వచ్చు.

పూర్వం చేసిన కర్మలకనుగుణంగానే ఈ జన్మలో పాపపుణ్యాలు ఉంటాయి. ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు.

మనిషి ఎంత మూర్ఖుడంటే మండుతున్న ఓ అడవి మధ్యలో చెట్టుపై కూర్చుంటాడు. కానీ, తొందరలోనే ఆ అగ్ని అతన్ని కూడా దహించివేస్తుందని తెలుసుకోలేడు.

అహింస గొప్ప మతం. నీకు జీవించడానికి ఎలాగైతే హక్కు ఉంటుందో.. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది.

ఏదైనా ఒక పనిని రోజూ చేయాలంటే అది అలవాటు అయ్యేవరకూ ఎటువంటి సడలింపులూ, వాయిదాలు వేయకూడదు.

పర్యావరణం ఇంత నిర్మలంగా ఉందంటే దాని అర్థం.. మనం దాన్ని నాశనం చేసినా తిరిగి ఏం చేయలేదని కాదు. ఏదో ఒకరోజు దాని ఫలితాన్ని తప్పక అనుభవించాలి. 

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home