ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?
నిత్యం వినియోగించే ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో చూసేద్దాం.
This browser does not support the video element.
గేమ్ ఆడొచ్చు..
చాట్ బాక్స్‌లో ఎవరో ఒకరికి ఎమోజీ సెండ్ చేసి దాన్ని ట్యాప్ చేయాలి. వెంటనే ఎల్లో స్క్రీన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి గేమ్ ఆడేయొచ్చు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ గేమ్ ట్రై చేయండి.
క్విక్ షేర్
ఇన్‌స్టా ఫీడ్‌లోని పోస్ట్ కింద ఉన్న షేర్ ఐకాన్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే మీ ఫ్రెండ్స్ లిస్ట్ అక్కడే కనిపిస్తుంది. దీంతో సులువుగా అక్కడే షేర్ చేసేయొచ్చు.
కామెంట్లపై నియంత్రణ
ఫొటో లేదా వీడియో పోస్ట్ చేసేముందు కింద Advanced settings ఉంటుంది. దాన్ని ఎంచుకొని కామెంట్ సెక్షన్‌ని ఆఫ్ చేయొచ్చు. అంతే కాదు మీ పోస్ట్‌కు సంబంధించిన లైక్‌లు, వ్యూస్ కూడా నియంత్రించేందుకు అక్కడే మరో ఆప్షన్ ఉంటుంది.
పాట సెట్ చేయొచ్చు
స్టోరీ పోస్ట్ చేసే సమయంలో పైన కనిపించే మ్యూజిక్ సింబల్‌ని ఎంచుకొని నచ్చిన పాటను ఎంచుకోవచ్చు. ఫొటోకు తగ్గట్లుగా ఎఫెక్ట్స్, పాటలు అక్కడే యాడ్ చేసేయొచ్చు.
ఎడిట్ ఆప్షన్
ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్‌ని సెలెక్ట్ చేస్తే edit ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మెసేజ్‌లో తప్పులు సరిచేయొచ్చు. మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు ఐదు సార్లు మాత్రమే ఎడిట్ చేసే వెసులుబాటు ఉంటుంది.
షెడ్యూల్
ఫలానా రోజున పోస్ట్ చేయాలనుకున్న స్టోరీని ముందుగా షెడ్యూల్ చేసుకొనే ఫీచర్ ఇన్‌స్టా ఉంది. Advanced Settingsలోకి వెళ్లి Scheduleపై ట్యాప్ చేసి మీరు ఏ రోజు పోస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి. వ్యాపారులకు, క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్
క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్
నచ్చిన వాళ్లకు మాత్రమే పోస్టులు పంపేలా క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం ప్రొఫైల్‌కు వెళ్లి మూడు గీతలపై క్లిక్ చేసి close friends ఆప్షన్ ట్యాప్ చేసి స్నేహితులను ఎంచుకోవచ్చు.
హిస్టరీ
మీరు లైక్, కామెంట్, ట్యాగ్ చేసిన వాళ్ల మొత్తం సమాచారాన్ని ప్రొఫైల్‌లోని Your activityకి వెళ్లి చూసేయొచ్చు. అందులో డేట్, ఆథర్స్ అంటూ ప్రత్యేక ఫిల్టర్లుంటాయి. వైరల్ అయిన అంశాల్ని (#) హ్యాష్‌ట్యాగ్‌తో వెతికేయొచ్చు. మీ స్టోరీలో @ ఉపయోగించి ఫ్రెండ్స్‌ని జత చేయొచ్చు.