బెర్రీలు.. మేఘాలు.. సెల్ఫీలు.. ఇవీ ప్రియాంక సరదాలు

సగటు టాలీవుడ్‌ హీరోయిన్ల లెక్కలకు దూరంగా.. విజయాలకు దగ్గరగా ఉండే హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ సారి ఇన్‌స్టాగ్రామ్‌ స్క్రోల్‌ చేస్తే...

ప్రియాంకకు ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టం. కాలంతో సంబంధం లేకుండా తెగ లాగించేస్తుంది. అందులోనూ వెనిలా విత్‌ చాక్లెట్‌ ఆమె ఫేవరెట్‌. 

ప్రకృతితో మమేకం అవ్వడమంటే ఆమెకు ఇష్టం. మొక్కలు, పువ్వులు, చెట్లు తనకు మంచి స్నేహితులు అని హగ్‌ చేసుకొని మరీ చెబుతోంది. 

రంగుతో, డిజైన్‌తో పనేముంది.. కొత్తగా ఉందా లేదా? ఇదే ప్రియాంక ఫ్యాషన్‌ కిటుకు. అందుకే కొత్త డ్రెస్‌ కనిపిస్తే వేసుకోని.. ఫొటోలకు రెడీ.

ఇక క్యూట్‌ సెల్ఫీలు, ఇంట్రెస్టింగ్‌ ఫొటోలు ఆమె ఇన్‌స్టాలో కోకొల్లలు. వాటిలో ఇదొకటి.

‘కాఫీ ఫస్ట్‌..’ ఇదే ప్రియాంక నినాదం. ఉదయాన్నే మంచి కాఫీ.. దానికి ఇళయరాజా మ్యూజిక్‌ పడితే రోజంతా హ్యాపీ అనుకునే రకం ఆమె. 

‘గోల్డెన్‌ స్పారో..’ అని పాటకు డ్యాన్స్‌ వేసిందని కాదు గానీ.. ఇన్‌స్టాలోని గోల్డెన్‌ శారీలో అయితే అందాల పిచ్చుకలానే ఉంది. 

అద్దం కనిపించింది అంటే కాసేపు అక్కడే ఆగిపోతుంది ప్రియాంక. తన ఇంట్లో తనకు బాగా నచ్చిన ప్రదేశం అదే అని చెబుతోంది. 

ప్లేటు నిండా బెర్రీలు ఉంటే చాలు అనుకునే రకం ఆమె. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ.. ఇలా ఏ బెర్రీ అయినా ఇష్టంగా తింటుంది. 

ప్రియాంకకు నెఫోఫిలియా ఉంది. అదేంటో అనుకునేరు.. మేఘాలంటే ఇష్టం ఉన్న వాళ్ల గురించి చెప్పడానికి ఆ పదం వాడతారు లెండి. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home