60 నాటకాలు.. ఒక పుస్తకం.. మిస్‌ ఇండియా నిఖిత టాలెంట్‌

ముంబయిలో జరిగిన ‘ఫెమినా మిస్‌ ఇండియా - 2024 ’ పోటీల్లో నిఖిత పోర్వాల్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది.  

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖిత.. 30 మంది కంటెస్టంట్‌లతో నిర్వహించిన ఈ పోటీలో అనేక సవాళ్లను దాటుకొని గెలిచింది. 

పాఠశాల చదువు కార్మెల్‌ కన్వర్ట్‌ సెంకడరీలో సాగగా.. ఉన్నత విద్య గుజరాత్‌లోని మహారాజా సయాజీరావ్‌ యూనివర్శిటీలో కొనసాగుతోంది.

స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడం అంటే ఇష్టం. 18 ఏళ్లకే థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కిపైగా నాటకాలు వేసింది. స్టేజ్‌ యాక్టింగ్‌ను ఫస్ట్‌ లవ్‌ అని చెబుతోంది.

ఇటు కెరీర్‌ను, అటు చదువును బ్యాలెన్స్‌ చేస్తుంది. చదువుతూనే మోడలింగ్‌పైనా దృష్టి పెట్టింది. 

నిఖిత త్వరలోనే బాలీవుడ్‌ తెరపై మెరవనుందని సమాచారం. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా ఛాన్స్‌ వచ్చిందట. అయితే అది కథానాయికనా కాదా అనేది తెలియాలి.

రచయితగానూ గుర్తింపు తెచ్చుకుంది నిఖిత. ‘కృష్ణ లీల’ అనే పుస్తకాన్ని రాసింది.

జంతువుల సంరక్షణ కోసం ఎన్జీవోలతో కలసి పని చేస్తోంది. జంతు వధకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంటుంది.

‘ఫిట్‌నెస్‌ కోసం నియమాలను పెట్టుకుంటాను. కానీ అమ్మ చేతి వంట అయితే.. నా నోటిని అదుపు చేయలేను’ అంటోందీ నయా మిస్‌ ఇండియా.

ఈమెకి తీర్థయాత్రలంటే మహా ఇష్టం. తరచూ కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తూ ఉంటుంది.  

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు.. ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

Eenadu.net Home