‘పాస్‌వర్డ్‌’ గురించి మీకివి తెలుసా?

పాస్‌వర్డ్‌ విధానాన్ని తొలిసారిగా 1961లో కనిపెట్టారు. మసా చూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కంప్యూటర్‌ సెంటర్‌కు చెందిన ఫెర్నాండో జె. కార్బాటో అనే కంప్యూటర్‌ శాస్త్రవేత్త పాస్‌వర్డ్‌ను సృష్టించారు.

Image:Pixabay

 1970ల్లో పర్సనల్‌ కంప్యూటర్స్‌ వినియోగం పెరగడంతో పాస్‌వర్డ్‌ అత్యవసరమైంది. అలా ఇప్పుడు ప్రతి దానికి పాస్‌వర్డ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Image:Pixabay

ప్రపంచంలో 51శాతం మంది వివిధ వృత్తిపర, వ్యక్తిగత అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నారట.

Image:Pixabay

పాస్‌వర్డ్స్‌ హ్యాక్‌కి గురైనా.. 57శాతం మంది అదే పాస్‌వర్డ్‌ను కొనసాగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

Image:Pixabay 

టాప్‌ 10 కామన్‌ పాస్‌వర్డ్స్‌ ఏవంటే.. 123456, 123456789, qwerty, password, 12345, qwerty123, 1q2w3e, 12345678, 111111, 1234567890

Image:Pixabay

వ్యక్తిగత వివరాలు లీక్‌ అవడానికి 80శాతం.. యూజర్స్‌ పెట్టుకునే పాస్‌వర్డే కారణం.

Image:Pixabay

ప్రపంచంలో 81శాతం మంది యువతీయువకులు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్స్‌లో తమ మెయిల్‌ ఐడీస్‌తో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని ఆ మెయిల్‌ఐడీ, పాస్‌వర్డ్స్‌ను కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంటున్నారట.

Image:Eenadu

ప్రపంచవ్యాప్తంగా 37శాతం మంది నెలకోసారైనా ఏదో ఒక వెబ్‌సైట్‌కు పెట్టుకున్న పాస్‌వర్డ్‌ను మర్చిపోయి.. ఫర్‌గెట్‌ పాస్‌వర్డ్‌ రిక్వెస్ట్‌ పెడుతున్నారట.

Image:Pixabay

జెన్‌-జడ్‌ యూజర్లలో 78శాతం మంది వివిధ ఆన్‌లైన్‌ అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటున్నారు.

Image:Pixabay 

ఒక్క పాస్‌వర్డ్‌ను సుమారు ఐదు అకౌంట్లకు ఉపయోగిస్తుంటారని ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్‌పై పరిశోధనలు చేస్తోన్న పోనెమన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది.

Image:Pixabay 

4 క్యారెక్టర్స్‌ ఉన్న పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు చిటికెలో కనిపెట్టెస్తారట. అదే 8 క్యారెక్టర్స్‌(నంబర్స్‌, లోయర్‌ కేస్‌, అప్పర్‌ కేస్‌, సింబల్స్‌) ఉన్న పాస్‌వర్డ్‌ను కనిపెట్టడానికి హ్యాకర్లకు 39 నిమిషాలు పడుతుందట.

Image:Pixabay  

అదే.. 18 క్యారెక్టర్స్‌(నంబర్స్‌, లోయర్‌ కేస్‌, అప్పర్‌ కేస్‌, సింబల్స్‌)ఉన్న పాస్‌వర్డ్‌ను కనిపెట్టాలంటే.. 438ట్రిలియన్‌ సంవత్సరాలు పడుతుందట.

Image:Pixabay 

ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. తన పాస్‌వర్డ్‌ ఎలా ఉంటుందో వెల్లడించారు.

Image:Eenadu

Source:Twitter

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home