12th fail.. నటిగా పాస్‌..!

‘12th ఫెయిల్‌’ ఫేమ్‌ మేధా శంకర్‌కు రోజురోజుకూ నెట్టింట ఫాలోయింగ్‌ పెరిగిపోతోంది. ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలివీ..

నోయిడాలో పుట్టి, పెరిగింది. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఎఫ్‌బీబీ ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో మెరిసింది.

హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది. సితార్‌, హార్మోనియం, కీబోర్డు ప్లే చేయగలదు.


నటనపై ఉన్న మక్కువతో ముంబయికి మకాం మార్చింది. ‘విత్‌ యు ఫర్‌ యు ఆల్వేజ్‌’ అనే లఘు చిత్రంతో నటిగా మారింది.

బ్రిటిష్‌ సిరీస్‌ ‘బీకమ్‌ హౌజ్‌’ (2019), మరో సిరీస్‌ ‘దిల్‌ బేకరార్‌’ (2021)లో కీలక పాత్రలు పోషించింది.

‘శాదీస్తాన్‌’ (2021)తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఆ సినిమాలో అర్షి మోదీగా ఆకట్టుకుంది.

2022లో వచ్చిన ‘మ్యాక్స్‌, మిన్‌ అండ్‌ మ్యూజకీ’లో బాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది. ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమవడం విశేషం.

మూడో సినిమా ‘12th ఫెయిల్‌’లో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్‌ సంపాదించుకుంది. అందులోని ‘బోలో నా’ పాటను పాడి అలరించింది.

సినిమా విడుదలకు ముందు 16 వేల ఫాలోవర్స్‌ కలిగి ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా.. విడుదల తర్వాత 20 లక్షలకు చేరుకుంది. మేధ ఎంతగా మాయ చేసిందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు.

ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవితాధారంగా రూపొందిన ఆ చిత్రంలో.. ఆయన ప్రియురాలు, సతీమణిగా నటించింది. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ స్ఫూర్తిదాయక చిత్రం ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధ.. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.

సవాలు విసిరే పాత్రలనే ఎంపిక చేసుకుంటానని, నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితంకాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

శారీ లుక్కు అదిరిందమ్మా.. భాగ్యం..!

బంగీ జంప్‌.. లాంగ్‌ డ్రైవ్‌.. మంచు ట్రిప్‌

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

Eenadu.net Home