శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్‌ అనతికాలంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా మారింది. అలా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. 

కమల్‌ హాసన్‌ ‘హే రామ్’లో బాల నటిగా తొలిసారి వెండితెరపై కనిపించింది. అలా ఇప్పటివరకు 5 భాషల్లో 45కిపైగా చిత్రాల్లో నటించింది. 

హిందీ సినిమా ‘లక్’తో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా విడుదలై 15 ఏళ్లు అవుతోంది. అంటే శ్రుతి కెరీర్‌కీ 15 ఏళ్లే. 

ఆ తర్వాత ‘అనగనగా ఓ ధీరుడు’, ‘3’, ‘సెవన్త్‌ సెన్స్‌’, ‘దిల్ తో బచ్చా హై’, ‘ఓ మై ఫ్రెండ్’ లాంటి సినిమాలు చేసినా సరైన విజయాలు అందుకోలేదు. 

 ఇక సినిమాలు కష్టమే అనుకుంటున్న సమయంలో పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమా విజయం శ్రుతి కెరీర్‌ను పరుగులు పెట్టించింది. 

 ఆ తర్వాత ‘బలుపు’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రేసు గుర్రం’, ‘ఎవడు’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్’ అంటూ వరుసగా స్టార్‌ హీరోలతో నటించింది.

2022లో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో కెరీర్‌ మరోసారి డౌన్‌ అవుతోంది అని అనుకుంటుండగా... 2023లో నాలుగు హిట్లతో అదరగొట్టింది.

గతేడాది భారీ విజయాలు అందుకున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి, ‘సలార్‌’లో ఆమెనే హీరోయిన్‌. వీటితోపాటు ‘హాయ్ నాన్న’లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా హిట్టే. 

ప్రస్తుతం శ్రుతి చేతిలో 4 పాన్‌ ఇండియా సినిమాలున్నాయి. ప్రభాస్‌ ‘సలార్ 2’,శేష్‌ ‘డెకాయిట్’, రజనీకాంత్‌ ‘కూలీ’, యశ్‌ ‘టాక్సిక్‌’లో ఆమెవి కీలక పాత్రలు. 

శ్రుతి గొంతుకు కూడా ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ‘భారతీయుడు 2’ తమిళ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో ఆమె పాట, దానికి ప్రేక్షకుల ఆట చూసే ఉంటారు. 

ఇండస్ట్రీలో వారసులకు సులభంగా అవకాశాలు వస్తాయనేది అపోహ అని శ్రుతి కెరీర్‌ చూస్తే అర్థమవుతుంది. కష్టపడి పని చేస్తే ఛాన్స్‌లు వస్తాయి అనడానికీ ఆమెనే ఉదాహరణ.

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

Eenadu.net Home