బ్రేక్‌ వస్తే బ్రౌజింగ్‌ చేసేదాన్ని..

విజయ్‌సేతుపతి ‘96’లో చిన్నప్పటి జానుగా చేసిన అమ్మాయి గుర్తుందా..! అదేనండీ.. తెలుగు రీమేక్‌ ‘జాను’లోనూ అదే పాత్ర పోషించింది.. తనే గౌరి జి.కిషన్‌. ఆ సినిమాతో టీనేజ్‌ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోయిన్‌గా తెరపై రాణిస్తోంది.

‘శ్రీదేవి శోభన్‌బాబు’, ‘బిగినింగ్’, ‘ఆడియే’, ‘ఉలగమ్మాయ్‌’ వంటి పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించింది.

గౌరి నటించిన మలయాళ చిత్రం ‘లిటిల్‌ మిస్‌ రాథర్‌’ను తెలుగులో ‘లిటిల్ మిస్‌ నైనా’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది ఓటీటీ ఈటీవీ విన్‌లో విడుదలైంది.

ఇటీవల‘పేపర్‌ రాకెట్‌’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది. ‘లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌’ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ‘ఔరు భారత సర్కార్‌ ఉల్‌పన్నమ్‌’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.

కేరళ(1999)లో పుట్టి పెరిగిన గౌరి.. బెంగళూరులో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

‘జాను’తో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది గౌరికి బదులుగా జాను అనే పిలుస్తున్నారట. గౌరి అంతలా ఒదిగిపోయింది మరి ఆ పాత్రలో..  

ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌. పోస్టులు పెడుతూ.. కామెంట్స్‌, లైవ్‌ వీడియోల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

గౌరి.. హిందీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడగలదు. కాలేజీలో నాటకాలు, కల్చరల్‌ యాక్టివిటీల్లో ఎక్కువగా పాల్గొనేది.

‘కాలేజీలో బ్రేక్‌ సమయంలోనూ ఇంటర్నెట్‌తోనే ఎక్కువగా గడిపేదాన్ని. ఎప్పుడు బ్రేక్‌ వస్తుందా అని ఎదరు చూసి మరీ వెంటనే బ్రౌజింగ్‌లో మునిగిపోయేదాన్ని’. అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

‘అరబిక్‌ వంటకాలంటే ఇష్టం. కానీ నేను శాకాహారిని. కూరగాయలు, ఆకుకూరల్నే తింటాను. ఎక్కువ సమయం పాటలు వింటూ, డ్యాన్స్‌ చేస్తూ సమయం గడిపేస్తాను’. అని చెబుతుంది. 

ఫిట్‌గా ఉండేందుకు గౌరి జాగింగ్‌, వాకింగ్, జిమ్‌ చేస్తుంది. ఏ మాత్రం బరువు పెరగకుండా కఠినమైన డైట్‌ను పాటిస్తుంది.

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

Eenadu.net Home