జెమీ లీవర్‌ తెలుగులో ఎంట్రీ...

‘ఆ ఒక్కటీ అడక్కు’తో జెమీ లీవర్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ తమ్ముడి భార్య పాత్రలో నవ్వులు పూయిస్తోంది. 

‘మా అమ్మమ్మది మాతృ భాష తెలుగే. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలనే నాకల ‘ఆ ఒక్కటీ అడక్కు’తో నిజమైంది. నటులు.. భాష ఏదైనా ఒకే భావంతో అలరించాలి.’ అంటోంది జెమీ. 

బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ జానీ లీవర్‌ కుమార్తెనే ఈ జెమీ లీవర్‌. హిందీలో 2015లో ‘కిస్‌ కిస్‌కో ప్యార్‌ కరూ’తో నటిగా మారింది. 

ముంబయిలో జన్మించిన జెమీ.. లండన్‌లో మార్కెటింగ్‌లో మాస్టర్స్‌ పట్టా అందుకుంది. కొద్ది రోజులు లండన్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసింది. 

ఆ తర్వాత 2012లో భారత్‌కు తిరిగొచ్చేసింది. తండ్రిలాగే కామెడీ పండించేందుకు సిద్ధమైంది. స్టాండప్‌ కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.  

టీవీలో ‘కామెడీ సర్కస్‌ కే మహాబలి’ ప్రోగ్రాంలో పాల్గొంది. తనకంటూ గుర్తింపు తెచ్చుకొని పలు టీవీషోలకు హోస్ట్‌గా వ్యవహరించింది.

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’లో మెరిసింది.‘పాప్‌ కౌన్‌’ వెబ్‌సిరీస్‌లోనూ నటించి ఆకట్టుకుంది ఈ లేడీ కమెడియన్‌. 

This browser does not support the video element.

‘నాకు డ్యాన్స్‌ చేయడమంటే ఎంతో ఇష్టం. ఎక్కువ సమయం డ్యాన్స్‌ చేస్తూనే ఉంటాను. దీని వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది’ అని చెబుతోంది జెమీ.

‘నాకూ మా నాన్నలాగే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండాలనుంది. ఒక కమెడియన్‌కు వ్యక్తిగతంగా ఎన్ని బాధలు ఉన్నా స్టేజీ మీదకి వెళ్లాక ప్రేక్షకులను నవ్వించాలనే ధ్యేయంతోనే ముందుకు సాగాలి’ అని ఓ సందర్భంలో తెలిపింది.

 జెమీకి విహారయాత్రలకు వెళ్లడమన్నా ఎంతో ఇష్టం. రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. ఇన్‌స్టాలో తనని 14లక్షల మంది ఫాలో అవుతున్నారు.

‘జంక్‌ఫుడ్‌ ఫేవరెట్‌. నచ్చినవన్నీ తినేస్తాను. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ సమయం జిమ్‌ చేస్తాను. దాంతో పాటు డ్యాన్స్‌ కూడా నన్ను ఫిట్‌గా ఉంచుతుంది’అని చెప్పుకొచ్చింది. 

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home