ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

నెట్టింట మార్మోగుతున్న పేరు ఆన్వీ కామ్‌దార్‌. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో లక్షల్లో ఫాలోవర్లు.. ట్రావెల్‌ వ్లాగ్‌లు, రీల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె దుర్మరణం పాలైంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది.

This browser does not support the video element.

మహారాష్ట్రలోని కుంభే జలపాతానికి స్నేహితులతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది ఆన్వీ. జలపాతాల గురించి వివరిస్తూ, అజాగ్రత్తతో లోయ అంచుకు వెళ్లింది. అక్కడి నుంచి జారి లోయలో పడిపోయింది.

ఆరుగంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీసుకొచ్చినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.

ఆన్వీకి ట్రావెలింగ్‌ అంటే మహా ఇష్టం. కొత్త కొత్త ప్రాంతాలు సందర్శిస్తూ, వాటిపై వ్లాగ్‌లు చేస్తూ యూట్యూబ్‌లోనూ, ఇన్‌స్టాలోనూ పోస్టు చేసేది.

This browser does not support the video element.

ఆ రీల్స్‌తోనే ఈమె బాగా పాపులర్‌ అయ్యింది. ట్రెక్కింగ్‌ చేస్తూ హుషారుగా వీడియోలు చేసేది. 

 పుట్టి పెరిగింది ముంబయిలో. అయిదేళ్లుగా డెలాయిట్‌లో సీఏగా పనిచేసింది. 

This browser does not support the video element.

ట్రావెలింగ్‌ మీద ఆసక్తితో ‘ఎవరైనా ఏం చేస్తున్నావ్‌..’ అని అడిగితే.. ట్రావెల్‌ డిటెక్టివ్‌ అని చెప్పేది.

అదీ.. ఇదీ.. అని లేదు. అడవులను, సముద్రాలను, పురాతన కట్టడాలను, వివిధ దేశాలను చుట్టేస్తూ సరదాగా గడిపేది.

This browser does not support the video element.

సీజన్ల వారీగా వాతావరణాన్ని బట్టి ఆయా ప్రదేశాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించేది. ఇలా చేసిన మాన్‌సూన్‌ రీల్స్‌, వాటర్‌ఫాల్స్‌ రీల్స్‌కి మిలియన్స్‌లో వ్యూస్‌ వచ్చేవి.

ఈమెకి నేర్చుకోవడం అంటే ఇష్టం. టెక్నాలజీకి సంబంధించిన అంశాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించేది.

‘రెస్పాన్సిబుల్ ఏఐ, జెనరేటివ్‌ ఏఐ, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ వంటి పలు అంశాల్లో ఆన్వీ సర్టిఫికెట్లు అందుకుంది.

This browser does not support the video element.

ఆంత్రపెన్యూర్‌లను, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టే వారిని ప్రోత్సహించేది. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తుండేది. 

సామాజిక అవగాహన కల్పిస్తూ చేసే వీడియోలకు లక్షల్లో లైకులు వచ్చేవి. ఇన్‌స్టాలో ఈమెను 2లక్షల 72వేలకుపైగా ఫాలో అవుతున్నారు.

సమోసాకీ ఓ రోజుంది!

బిర్యానీ రుచిగా రావాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..

ఉపాధ్యాయ దినోత్సవం(SEP 5).. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూక్తులు!

Eenadu.net Home