ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన వారు కొందరైతే, యాక్టింగ్‌ ఇష్టంలేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల సినిమాల్లోకి వచ్చి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తుల్లో ధనుష్‌ ఒకరు. ‘రాయన్‌’ మూవీ విడుదల సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చూద్దాం.. 

తన తండ్రి, దర్శకుడు కసూర్తి రాజా ధనుష్‌ను ‘తుళ్లువదో ఇలమై’తో బలవంతంగా నటుడిని చేశారు. సినిమా హిట్టేగానీ లుక్స్‌ విషయంలో ఈ హీరోపై విమర్శలు వెల్లువెత్తాయి.

‘ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే పొందాలి’ అని ఫిక్స్‌ అయి ‘కాదల్‌ కొండెయిన్‌’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రాన్ని ఆయన సోదరుడు సెల్వ రాఘవన్‌ తెరకెక్కించడం విశేషం.  

16 ఏళ్లకే తెరంగేట్రం చేసిన ఈయన తొలి రెండు చిత్రాలతో నటనానుభవం గడించారు. జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్న స్క్రిప్టులనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. 

ఈయన నటనకు ప్రశంసలే కాదు రెండు జాతీయ అవార్డులు (ఆడుకాలం, అసురన్‌) వరించాయి. ఫిల్మ్‌ఫేర్‌, సైమా.. ఇలా ప్రఖ్యాత పురస్కారాలెన్నో అందుకున్నారు. 

నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథ, పాటల రచయితగా, గాయకుడిగా తనదైన ముద్ర వేశారు. స్టార్‌ హీరో ఇన్ని విభాగాలకు న్యాయం చేయడం మామూలు విషయం కాదు. 

ధనుష్‌ ఇదంతా తన సరదా కోసం చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన ‘కాకా ముట్టై’, ‘విశారణై’ జాతీయ అవార్డులు పొందాయి. ‘వై దిస్‌ కొలవెరి’గానూ బెస్ట్‌ సింగర్‌గా పురస్కారం దక్కించుకున్నారు. గేయ రచయితగా సైమా, ఐఐఎఫ్‌ఏ ఉత్సవం అవార్డులు సొంతం చేసుకున్నారు.

ధనుష్‌ ఎంత సెన్సిటివో ఆయన తెరకెక్కించిన తొలి సినిమా ‘పా. పాండి’ చూస్తే అర్థమవుతుంది. సుమారు ఆరేళ్ల తర్వాత ‘రాయన్‌’ కోసం మెగాఫోన్‌ పట్టారు. ఇది ఆయనకు 50వ చిత్రం కావడం విశేషం. అయితే, ఫస్ట్‌ మూవీకి భిన్నంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘రాయన్‌’ను రూపొందించారు. అందులో రెండు పాటలు రాశారు.

ఈ మల్టీటాలెంటెడ్‌ స్టార్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’తో టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ‘షమితాబ్‌’ వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులకూ తన ప్రతిభ చూపిన ధనుష్‌ ‘ది గ్రే మ్యాన్‌’తో హాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. 

ప్రస్తుతం నేరుగా తెలుగులో ‘కుబేర’లో నటిస్తున్న ధనుష్‌.. మరోవైపు ఇళయరాజా బయోపిక్‌లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. దర్శకుడిగా ఇప్పటికే ‘నిలవుకు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం’ బిజీగా ఉన్నారు. 

నచ్చని ఫీల్డ్‌లోకి వచ్చామని ఫీలవకుండా ఇష్టంతో పనిచేస్తే అదే రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చాటి చెప్పే ధనుష్‌ కెరీర్‌ ఎందరికో ఇన్‌స్పిరేషన్‌.  

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home