డైమండ్‌ గర్ల్‌.. అపర్ణ దాస్‌!

మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో శ్రీలీలతోపాటు మరో హీరోయిన్‌ కూడా కనిపించనుంది. తనే అపర్ణ దాస్‌. 

Image: Instagram/Aparna Das

ఈ చిత్రంలో అపర్ణ.. వజ్ర కాళేశ్వరి దేవిగా నటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మలయాళీ భామకు ఇదే తొలి తెలుగు చిత్రం.

Image: Instagram/Aparna Das

అపర్ణ.. ఒమన్‌లో 1995 సెప్టెంబర్‌ 10న మలయాళీ కుటుంబంలో జన్మించింది. అక్కడి ఇండియన్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసి.. భారత్‌లో డిగ్రీ, పీజీ చేసింది.

Image: Instagram/Aparna Das

ఎంబీఏ చేసిన ఈ భామ.. కొన్నాళ్లు అకౌంటెంట్‌గా ఉద్యోగమూ చేసింది. నటనపై ఇష్టంతో మొదట మోడలింగ్‌ చేసింది. పలు బ్రాండ్స్‌, మ్యాగజైన్లకు మోడల్‌గా వ్యవహరించింది.

Image: Instagram/Aparna Das

అపర్ణ టిక్‌టాక్‌ స్టార్‌. భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధానికి ముందు ఈమె.. టిక్‌టాక్‌ వీడియోలు చేసేది. దీంతో మంచి పాపులారిటీ వచ్చింది.

Image: Instagram/Aparna Das

టిక్‌టాక్‌లో అపర్ణను చూసి మలయాళీ దర్శకుడు సత్యన్‌ అంతికడ్‌ ‘ఎంజాన్‌ ప్రకాశన్‌’లో అవకాశమిచ్చారు. అలా ఓ చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది అపర్ణ.

Image: Instagram/Aparna Das

ఆ తర్వాత మలయాళంలోనే ‘మనోహరం’తో హీరోయిన్‌గా మారిపోయింది. తన అందంతో మాలీవుడ్‌నే కాదు.. ఇతర సినీ ఇండస్ట్రీలను ఆకర్షిస్తోంది. 

Image: Instagram/Aparna Das

కోలీవుడ్‌లో విజయ్‌ ‘బీస్ట్‌’తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో షాపింగ్‌మాల్‌లో ఉగ్రవాదుల చేతుల్లో బందీ అయిన వారిలో ఒకరిగా.. హోం మినిస్టర్‌ కుమార్తె, ఐపీఎస్‌ ట్రైనీ అపర్ణగా కనిపించింది తనే.

Image: Instagram/Aparna Das

ఇటీవల కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘దాదా’లోనూ అపర్ణ నటించింది. ప్రస్తుతం మలయాళీ చిత్రం ‘సీక్రెట్‌ హోమ్‌’లో నటిస్తోన్న అపర్ణ.. ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 

Image: Instagram/Aparna Das

ఈ బ్యూటీకి సీనియర్‌ నటి ఊర్వశి నటన అంటే చాలా ఇష్టమట. ఊర్వశి ఎంతో సహజంగా నటిస్తుందని.. ఆమెనే తనకు నటనలో స్ఫూర్తి అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

Image: Instagram/Aparna Das

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home