క్లాస్‌ మహారాణి.. భాగ్యశ్రీ బోర్సే

రవితేజ నటిస్తోన్న ‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు తెరకు పరిచయం అవుతుంది బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse). ఫస్ట్‌ లుక్‌లోనే తెలుగు యువత మనసు దోచిందీ భామ. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

ఔరంగాబాద్‌లో జన్మించిన భాగ్యశ్రీ.. లాగోస్‌లో విద్యను అభ్యసించింది.

ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో భారత్‌కు తిరిగి వచ్చేసి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది.

18 ఏళ్ల వయసులో మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. ఓ మోడలింగ్ ఏజెన్సీతో కలిసి వర్క్‌ చేసింది. అప్పుడే స్టైలింగ్‌ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది.

వస్త్రాభరణాలు, చాక్లెట్స్‌.. ఇలా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది

This browser does not support the video element.

ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చిన ‘క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ సిల్క్‌’ యాడ్‌ ఆమెకు పేరు తెచ్చిపెట్టింది.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘యారియాన్‌ 2’తో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె రాజ్యలక్ష్మిగా యువతను ఆకట్టుకుంది.

‘మిస్టర్‌ బచ్చన్‌’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె రవితేజకు జోడీగా కనిపించనుంది. హరీశ్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

This browser does not support the video element.

భాగ్యశ్రీకి ప్రకృతి, పర్యాటకం అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగానే ఆమె తరచూ టూర్స్‌కు వెళ్లి వస్తుంటుంది.

ఇన్‌స్టాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందీ భామ. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను తరచూ షేర్‌ చేస్తుంటుంది. 150K మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home