షిర్లీ సేతియా.. అందం చూడవయా..

నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’తో తెలుగు తెరపై మెరిసిన నటి షెర్లీ సేతియా.

Image: Instagram/shirleysetia

ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించట్లేదు. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌మీడియాలో తన గ్లామర్‌ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/shirleysetia

డామన్‌ డయ్యూలో పుట్టి.. న్యూజిలాండ్‌లో పెరిగిన ఈ భామ.. ఆక్లాండ్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. 

Image: Instagram/shirleysetia

రేడియో జాకీగా పనిచేస్తూ.. అప్పుడప్పుడు పైజామా ధరించి బాలీవుడ్‌ పాటలు పాడుతూ.. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో పాపులరైంది.

Image: Instagram/shirleysetia

షిర్లీని న్యూజిలాండ్‌ మీడియా ‘పైజామా పాప్‌స్టార్‌’ అని పిలుస్తూ కథనాలు రాసుకొచ్చింది.

Image: Instagram/shirleysetia

ముంబయి, హైదరాబాద్‌లో సంగీత కచేరీలు నిర్వహించడంతో భారత్‌లో ఈమె పేరు మార్మోగింది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లోనూ ఈమె గురించి కథనం ప్రచురించారు.

Image: Instagram/shirleysetia

ఆ పాపులారిటీనే బాలీవుడ్‌లో పాటలు పాడే అవకాశాలను తెచ్చిపెట్టింది. అలా పలు ప్రైవేటు ఆల్బమ్స్‌తోపాటు సినిమా పాటలు కూడా పాడింది. 

Image: Instagram/shirleysetia

తొలిసారిగా ఈ యంగ్‌ బ్యూటీ 2018లో విడుదలైన ‘లాక్‌డౌన్‌’ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించింది. 

Image: Instagram/shirleysetia

ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ‘మస్కా (2020)’లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. 

Image: Instagram/shirleysetia

గతేడాదిలో ‘నికమ్మ’తో బాలీవుడ్‌లో, ‘కృష్ణ వ్రిందా విహారి’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/shirleysetia

ఈ భామ అందానికి కుర్రకారు ఫిదా అయిపోయింది. ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ పెరిగారు. ప్రస్తుతం ఈమెకు 7.9 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/shirleysetia

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home