దేవియాని.. అందాల అలివేణి!

ఇటీవల విడుదలైన ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌లో చైతన్యకృష్ణకి జోడీగా.. లాయర్‌గా ఆకట్టుకున్న నటి దేవియాని శర్మ. ఇప్పుడు మరో వెబ్‌సిరీస్‌ ‘సైతాన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

Image: Instagram/Deviyani Sharma

‘సేవ్‌ ది టైగర్స్‌’ను రూపొందించిన దర్శకుడు మహి వి. రాఘవే ‘సైతాన్‌’నూ రూపొందించారు. జూన్‌ 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైంది.

Image: Instagram/Deviyani Sharma

దిల్లీలో 1993 మే 30న జన్మించిన ఈ బ్యూటీ.. టీనేజ్‌లోనే మోడలింగ్‌ ప్రారంభించింది. నటనపై ఆసక్తితో దిల్లీలోని కొన్ని స్టేజీ నాటకాల్లోనూ పాల్గొంది.

Image: Instagram/Deviyani Sharma

బాలీవుడ్‌లో ‘లవ్‌శుదా’ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. అక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో 2019లో టాలీవుడ్‌కు వచ్చేసింది. 

Image: Instagram/Deviyani Sharma

హైదరాబాద్‌కు వచ్చిన దేవియాని.. తెలుగు నేర్చుకొవడానికి చాలానే కష్టపడింది. ఇప్పుడు అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతోంది. 

Image: Instagram/Deviyani Sharma

తొలిసారి ఈ భామ.. ‘భానుమతి & రామకృష్ణ’తో తెలుగు తెరపై కనిపించింది. తన నటన బాగుండటంతో అవకాశాలు క్యూ కట్టాయి. 

Image: Instagram/Deviyani Sharma

ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ చిత్రంలో, ‘అనగనగా’, ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’, ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌ల్లో నటించింది. 

Image: Instagram/Deviyani Sharma

ఇప్పుడు మరో వెబ్‌సిరీస్‌ ‘సైతాన్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో దేవియాని ‘జయప్రద’ అనే మాస్‌ అమ్మాయి పాత్ర పోషించింది.

Image: Instagram/Deviyani Sharma

ఈ భామ.. సినిమాల కంటే వెబ్‌సిరీస్‌ల్లోనే ఎక్కువ నటిస్తుండటంతో.. వెబ్‌సిరీస్‌ స్టార్‌గా మారిపోయింది. 

Image: Instagram/Deviyani Sharma

‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలకు దిల్లీ ప్రజలు ఫిదా అవుతున్నారట. అందుకే, దేవియాని కూడా టాలీవుడ్‌లో భాగం కావాలని హైదరాబాద్‌కు వచ్చేసిందట. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Image: Instagram/Deviyani Sharma

దేవియాని మంచి చిత్రకారిణి. ఖాళీ సమయాల్లో పెయింటింగ్స్‌ వేస్తూ ఉంటుంది. తన పెయింటింగ్స్‌ కోసమే ‘కళామాటిక్స్‌’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నిర్వహిస్తోంది. 

Image: Instagram/Deviyani Sharma

ట్రావెలింగ్‌ అంటే కూడా ఈ బ్యూటీకి చాలా ఇష్టమట. తరచూ విహారయాత్రకు వెళ్తుంటుంది.

Image: Instagram/Deviyani Sharma

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home