నిషా కళ్ల.. ఈషా గుప్తా!
గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా.. వెబ్‌సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకు, తన అభిమానులకు చేరువగానే ఉంది నటి ఈషా గుప్తా.
Image:Instagram/Esha Gupta
ఈ మధ్య గ్లామరస్ లుక్స్‌తో బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలోనూ ఫాలోయింగ్ పెరిగింది. ఇన్‌స్టాలో ఈ భామను 14 మిలియన్ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
Image:Instagram/Esha Gupta
ఇటీవల కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
Image:Instagram/Esha Gupta
దుబాయి వేదికగా జరిగిన బాలీవుడ్ ‘ఐఫా’ అవార్డు వేడుకలోనూ తన అందంతో కట్టిపడేసింది.
Image:Instagram/Esha Gupta
దిల్లీలో పుట్టిపెరిగిన ఈషా.. దెహ్రాదూన్, హైదరాబాద్‌లోనూ కొన్నాళ్లు చదువుకుంది.
Image:Instagram/Esha Gupta
ఫెమినా మిస్ ఇండియా(2007) పోటీల్లో పాల్గొని మిస్ ఫొటోజెనిక్‌గా నిలిచింది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌పై కూడా ఈషా తళుక్కుమంది.
Image:Instagram/Esha Gupta
బాలీవుడ్‌లో 2012లో వచ్చిన ‘జన్నత్ 2’తో తెరంగేట్రం చేసిన ఈషా.. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాల్లో నటించింది.
Image:Instagram/Esha Gupta
‘రాజ్ 3డీ’, ‘చక్రవ్యూహ్’, ‘బేబీ’, ‘రుస్తుం’, ‘కమాండో 2’, ‘బాద్షాహో’, ‘వన్‌డే-జస్టిస్ డెలీవర్డ్’ తదితర చిత్రాల్లో నటించింది.
Image:Instagram/Esha Gupta
తెలుగులో ఈషా ఒకే ఒక్క చిత్రంలో నటించింది. 2017లో సచిన్ జోషీ హీరోగా.. తాతినేని సత్య తెరకెక్కించిన చిత్రమది. తమిళ్‌లోనూ విడుదలైంది.
Image:Instagram/Esha Gupta
పలు మ్యూజిక్ వీడియోలు, టీవీ షోల్లోనూ మెరిసింది. ‘హై ఫీవర్ - డ్యాన్స్ కా నయా తేవార్’ అనే డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించింది.
Image:Instagram/Esha Gupta
సినిమాలకు 2019 నుంచి దూరంగా ఉన్నా.. 2020లో రిజెక్ట్ ఎక్స్, 2021లో నకాబ్, 2022లో ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకుంది.
Image:Instagram/Esha Gupta
ఇప్పుడు మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే తను నటించిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ‘ఫైల్ నం. 323’ షూటింగ్ జరుగుతోంది.
Image:Instagram/Esha Gupta
ఈ 37 ఏళ్ల భామ.. స్పెయిన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోంది.
Image:Instagram/Esha Gupta
ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను ఈషా.. ఇన్‌స్టాలో షేర్ చేసింది.
Image:Instagram/Esha Gupta