తెలుగుతెరపైకి మరో ‘తేజ’ హీరోయిన్!
కాజల్, సదా ఇలా చాలా మంది హీరోయిన్లను టాలీవుడ్‌కి పరిచయం చేశారు దర్శకుడు తేజ. తాజాగా ఆయన మరో హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నారు.. ఆమెనే గీతికా తివారీ.
Image: Instagram
నిర్మాత సురేశ్ కుమారుడు, రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ హీరోగా.. తెరకెక్కుతోన్న ‘అహింస’లో అభిరామ్‌కు జోడిగా గీతిక నటిస్తోంది.
Image: Instagram
ఇందులో గీతిక కాస్త డీగ్లామరస్‌గా కనిపించనుంది. ఇటీవల విడుదలైన సినిమా పాటలు, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
Image: Instagram
అంతకుముందు తమిళ్‌లో శరవణ నటించిన ‘ది లెజెండ్’తో తొలిసారి వెండితెరపై మెరిసింది గీతిక.
Image: Instagram
గీతికకు మోడలింగ్‌లో మంచి గుర్తింపు ఉంది. గతంలో హీరో నాగార్జునతో కలిసి ఓ ప్రచార చిత్రంలో నటించింది.
Image: Instagram
ఆ సమయంలోనే దక్షిణాది చిత్రసీమలో హీరోయిన్‌గా ప్రయత్నించమని నాగార్జున ఆమెకు సలహా ఇచ్చారట. ఆయన సూచనతోనే సినిమాలవైపు వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Image: Instagram
ఎవరి అండ లేకుండా సినీ ఇండస్ట్రీలో అవకాశాల్ని పొందడం చాలా గొప్ప విషయమని, ఇక్కడ నిలదొక్కుకోవడమే అసలైన సవాలని అంటోందీ భామ.
Image: Instagram
ఇండస్ట్రీ ఈమెకు ఎన్నో పాఠాలు నేర్పించిందట. ఇకపై దేన్నైనా ఓపికగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేస్తోంది.
Image: Instagram
గీతిక.. ఫిట్‌నెస్ ఫ్రీక్. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటుంది. జిమ్ ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది.
Image: Instagram
తనకు చాక్లెట్స్ అంటే మహా ఇష్టం. ఏ ఫుడ్‌లో అయినా చాక్లెట్ ఫ్లేవర్ ఉండాల్సిందేనంటోంది.
Image: Instagram