ఈ ‘స్పై’ చాలా హాట్‌ గురూ..!

తెలుగులో ఇప్పటివరకు హీరోయిన్‌గా ఒక్క సినిమా చేయకున్నా.. ఐశ్వర్య మేనన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 

Image: Instagram/Iswarya Menon

తాజాగా ఈ భామ.. రెడ్‌ టాప్‌, బ్లాక్‌ ప్యాంట్‌ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. తెగ వైరల్‌ అవుతున్నాయి.

Image: Instagram/Iswarya Menon

ఈమె పోస్టులు చూసి టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ కూడా ‘స్పై ఆన్‌ ఫైర్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. 

Image: Instagram/Iswarya Menon

కోలీవుడ్‌కు చెందిన ఐశ్వర్య.. ‘స్పై’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో నిఖిల్‌ హీరోగా నటిస్తున్నాడు.

Image: Instagram/Iswarya Menon

కేరళలో పుట్టిన ఐశ్వర్య తమిళనాడులోని ఈరోడ్‌లో పెరిగింది. అక్కడే ఇంజినీరింగ్‌ చదువుకుంది.

Image: Instagram/Iswarya Menon

కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పనిచేసిన ఈ కోలీవుడ్‌ బ్యూటీ.. నటనపై ఆసక్తితో రూ. లక్షల వేతనం వదులుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Image: Instagram/Iswarya Menon

అలా.. 2012లో తమిళ చిత్రం ‘కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి’లో చిన్న పాత్ర చేసింది. ఇదే సినిమాను తెలుగులో ‘లవ్‌ ఫెయిల్యూర్’గా రీమేక్‌ చేశారు.

Image: Instagram/Iswarya Menon

మరుసటి ఏడాది కన్నడలో ‘దశవల’లో నటించింది. ఆ తర్వాత ‘మాన్‌సూన్‌ మ్యాంగోస్‌’ అనే మలయాళీ చిత్రంలోనూ మెరిసింది.

Image: Instagram/Iswarya Menon

సినిమాల్లోనే కాదు.. ఈ భామ ‘తమిళ్‌ రాకర్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

Image: Instagram/Iswarya Menon

ఈ పదేళ్లలో ఐశ్వర్య చేసింది కేవలం పది సినిమాలే కానీ.. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతోంది. 

Image: Instagram/Iswarya Menon

ఈ భామకు సోషల్‌మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాలో 2.9 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/Iswarya Menon

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home