కావ్య థాపర్.. కొంటెచూపులు సూపర్
సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది నటి కావ్య థాపర్.
Image: Instagram/Kavya Thapar
ఇటీవల ఈ బ్యూటీ రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది.
Image: Instagram/Kavya Thapar
ఇందులో షాహిద్ కపూర్ ప్రియురాలిగా.. గొప్పింటి అమ్మాయిగా కనిపించింది.
Image: Instagram/Kavya Thapar
కావ్య ముంబయిలో పుట్టి.. పెరిగింది. ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో డిగ్రీ చేసింది.
Image: Instagram/Kavya Thapar
ఈ ముంబయి బ్యూటీ 2013లో ‘తత్కాల్’ అనే హిందీ షార్ట్ ఫిల్మ్‌తో నటన ప్రారంభించింది.
Image: Instagram/Kavya Thapar
ఆ తర్వాత పతాంజలి, మేక్ మై ట్రిప్ తదితర బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Kavya Thapar
తెలుగులో 2018లో విడుదలైన ‘ఈ మాయ పేరేమిటో’తో వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది.
Image: Instagram/Kavya Thapar
This browser does not support the video element.
మరుసటి ఏడాది తమిళ్‌లో ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’తో ఎంట్రీ ఇచ్చింది.
Image: Instagram/Kavya Thapar
మళ్లీ తెలుగులో రెండో చిత్రంగా ‘ఏక్ మినీ కథ’లో నటించి మెప్పించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
Image: Instagram/Kavya Thapar
టాలీవుడ్‌లో నాని, ప్రభాస్, రామ్‌చరణ్ నటన అంటే ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చిరంజీవి, ఎన్టీఆర్ డ్యాన్స్‌కు తను ఫిదా అయినట్లు తెలిపింది.
Image: Instagram/Kavya Thapar
గతేడాది బాలీవుడ్ చిత్రం ‘మిడిల్ క్లాస్ లవ్’, వెబ్‌సిరీస్ ‘క్యాట్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కావ్య.. ఇప్పుడు ‘ఫర్జీ’తో పాన్‌ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Kavya Thapar
ప్రస్తుతం ఈ సుందరి.. విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు 2’తోపాటు.. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, రవితేజ నటిస్తోన్న మరో చిత్రంలోనూ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.
Image: Instagram/Kavya Thapar
సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే కావ్యకి ఇన్‌స్టాలో 1.1మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Kavya Thapar