బర్త్ డే బేబీ కియారా.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ.. కియారా అడ్వాణీ. జులై 31 ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా కియారా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
కియారా 1992లో ముంబయిలో జన్మించింది. బాలీవుడ్ ఐకాన్ అశోక్‌కుమార్ ముని మనవరాలు ఈమె. జుహీ చావ్లాకు మేనకోడలు. తండ్రి దీప్ అడ్వాణీ వ్యాపారవేత్త. తల్లి ఉపాధ్యాయురాలు.
2014లో వచ్చిన ‘ఫగ్లీ’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ధోని బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో సాక్షి పాత్ర పోషించింది.
తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం ‘భరత్ అనే నేను’. ఆ తర్వాత ‘వినయ విధేయరామ’లోనూ నటించింది. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘వార్2’లో కథానాయికగా నటిస్తోంది.
‘నా అసలు పేరు ఆలియా. నాకు పాప పుడితే కియారా అనే పేరు పెట్టాలనుకున్నా. నా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు నాకో స్క్రీన్ నేమ్ కావాల్సి వచ్చింది. అందుకే ముందుగా ‘కియారా’ అని నేనే పెట్టేసుకున్నా’’ అని చెప్పింది.
‘‘అర్జున్‌రెడ్డిలో ప్రీతి పాత్ర నేనే చేయాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల చేయలేకపోయా. అయితే, బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’లో మళ్లీ ఆ అవకాశం వచ్చింది’’ అందుకే చాలా హ్యాపీ అంటోంది.
‘‘నేను కథక్ డ్యాన్సర్‌ని. రోజూ గంట పాటు కథక్ ప్రాక్టీస్ చేస్తా. దాంతోనే నా వ్యాయామం అయిపోతుంది. బయట ఫుడ్ అస్సలు తీసుకోను’’ అంటూ తన ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది.
‘‘నటిని కాకపోయుంటే చిత్రకారిణిగా, డ్యాన్సర్‌గా సెటిలైపోయేదాన్ని.. ఇప్పుడా అవకాశం లేదు. నటిగా ఫుల్ బిజీ అయిపోయా’’అని చెబుతోంది.
ప్రేమపై తనకు బోలెడంత నమ్మకం ఉందట. అందుకే కాబోలు.. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎక్కడికి వెళ్లినా.. ఈ జంట అందరినీ ఆకట్టుకుంటోంది.