కేరళ అందం.. యాక్షన్‌కే ప్రాధాన్యం!

#eenadu

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌ కుమార్తె అయిన మాళవిక ముంబయిలో బీఎంఎం (బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా) పూర్తి చేశారు. 

చదువుకొనే రోజుల్లో ఓ సారి తండ్రితో కలిసి యాడ్‌ షూట్‌కు వెళ్లారు. ఆ ప్రకటనలో నటించిన హీరో మమ్ముట్టి నటనపై ఆమెకున్న ఆసక్తిని గమనించారు.

మమ్ముట్టి సలహా మేరకు ఆడిషన్స్‌లో పాల్గొన్న మాళవిక ‘పట్టం పోలే’లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ ఆ చిత్రంలో హీరో.

సినిమా చిత్రీకరణ దశలో ఉండగా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ అనారోగ్యానికి గురికావడంతో.. ఈ హీరోయిన్‌ స్వయంగా డ్రెస్సులు డిజైన్‌ చేసుకోవడం విశేషం.

రొమాంటిక్‌ డ్రామాగా రూపొందిన ఆ సినిమా మిశ్రమ స్పందనలు అందుకోగా మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

ఈమె నటించిన రెండో సినిమా ‘నిర్యాయగం’ కూడా మిక్స్‌డ్‌ రివ్యూకే పరిమైంది. కానీ, బ్యాలెట్‌ డ్యాన్సర్‌గా ఈ నటి ఆకట్టుకున్నారు.

‘నాను మత్తు వరలక్ష్మి’ చిత్రంతో శాండిల్‌వుడ్‌లో, ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అక్కడా సత్తా చాటారు.

మమ్ముట్టి ‘ది గ్రేట్‌ ఫాదర్‌’లో ఇన్‌స్పెక్టర్‌గా పవర్‌ చూపించిన ఈ ముద్దుగుమ్మ.. రజనీకాంత్‌ ‘పేట’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు వారికీ పరిచయమయ్యారు.

విజయ్‌ ‘మాస్టర్‌’, ధనుష్‌ ‘మారన్’.. ఇలా ఓ వైపు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు యంగ్‌ హీరోలతో ‘క్రిస్టీ’లాంటి సినిమాలు చేశారు.

ఆమె నటిస్తున్న తొలి తెలుగు సినిమా ‘ది రాజాసాబ్‌’. ప్రభాస్‌ హీరో. 2019లో ఓ తెలుగు సినిమా ఖరారు కాగా అది ఆగిపోయింది.

పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ‘తంగలాన్‌’లో డీ గ్లామర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ఈమెను ‘మీకు డ్యాన్స్‌ ఇష్టమా? యాక్షన్‌ (ఫైట్లు) ఇష్టమా?’ అని ఫ్యాన్స్‌ అడిగితే.. యాక్షన్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు.

పరుగుల రాణి పీటీ ఉష బయోపిక్‌లో నటించాలనేది డ్రీమ్‌.

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

రవీనా టాండన్‌ వారసురాలు.. భలే చలాకీ!

Eenadu.net Home