మేఘా ఆకాశ్‌.. బిజీ హీరోయినే కానీ...

అందం, ప్రతిభ ఉన్నా అనుకున్నంత సక్సెస్‌ లేని టాలీవుడ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌.

Image: Instagram/Megha Akash

నితిన్‌ ‘లై’తో తెరంగేట్రం చేసిన ఈ చెన్నై భామ.. విజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది.

Image: Instagram/Megha Akash

తాజాగా ఆమె నటించిన ‘ప్రేమదేశం’ త్వరలో విడుదల కానుంది.

Image: Instagram/Megha Akash

మేఘ.. 1995 అక్టోబర్‌ 25న చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి కాగా.. తల్లి మలయాళీ.

Image: Instagram/Megha Akash

బీఎస్సీ విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా అందుకున్న మేఘ.. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.

Image: Instagram/Megha Akash

‘లై’కి ముందు తమిళంలో ‘ఓరు పక్క కథై’లో నటించింది. కానీ, ఆ సినిమా 2020లో ఓటీటీలో విడుదలైంది.

Image: Instagram/Megha Akash

నితిన్‌తో కలసి ‘ఛల్‌ మోహన్‌రంగా’ అంటూ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. 

Image: Instagram/Megha Akash

ఆ తర్వాత కోలీవుడ్‌లో వరసపెట్టి సినిమాలు చేసింది. రజినీకాంత్‌ ‘పేట్టా’ఆమె తొలి తమిళ చిత్రం. 

Image: Instagram/Megha Akash

2019, 2021లో మేఘ నటించిన సినిమాలు నాలుగేసి విడుదలయ్యాయి. వాటిలో సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’తోపాటు మరో హిందీ సినిమా ఉంది.

Image: Instagram/Megha Akash

ఆ తర్వాత ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘ’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది మేఘ.

Image: Instagram/Megha Akash

‘‘చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ప్రణాళికలు వేసుకున్నాను. కానీ, ఇక్కడ ప్రణాళికలకు అనుగుణంగా ఏదీ జరగదని అర్థమైంది’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Image: Instagram/Megha Akash

మేఘ ప్రేమ వివాహాన్నే ఇష్టపడుతుందట. తనకు కాబోయే భాగస్వామి తనను తనలా ఉండనివ్వాలని అంటోంది.

Image: Instagram/Megha Akash

ప్రస్తుతం మేఘ ‘గుర్తుందా శీతాకాలం’, ‘మను చరిత్ర’, ‘31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌’ సహా తొమ్మిది సినిమాల్లో నటిస్తోంది.

Image: Instagram/Megha Akash

ఈ భామలకు.. భలే క్రేజ్‌!

చమ్కీలా.. సుందరి

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home