రవీనా టాండన్‌ @ 50 

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి రవీనా టాండన్‌. శనివారం (అక్టోబర్‌ 26) ఆమె పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు..

రవి టాండన్‌ - వీణా దంపతుల కుమార్తె ఈమె. తమ పేరు కలిసి వచ్చేలా రవీనా అని పెట్టారు.

‘నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మోడల్‌గా చేస్తున్నప్పుడు మూవీ ఆఫర్‌ వచ్చింది. ‘పత్తర్‌ కే ఫూల్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా’ 

‘రథసారథి’, ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశవీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి తెలుగులో చిత్రాల్లో నటించారు.

కెరీర్‌లో అగ్ర స్థానంలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. 

‘మోహ్రా’తో హిట్‌ పెయిర్‌గా పేరు పొందారు అక్షయ్‌కుమార్‌-రవీనా. ఇందులోని ‘టిప్పు టిప్పు బరుసా పానీ’ సెన్సేషన్‌ హిట్‌. ఆ సినిమా తర్వాత వీరికి నిశ్చితార్థం జరిగింది. అనుకోని కారణాల వల్ల అది రద్దు అయింది.

2004లో అనిల్‌ తడానీతో ఈమె వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో రాణిస్తున్నారు.

ఆన్‌లైన్‌ ట్రోల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వను. ‘‘గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ వేదికగా కావాలని విమర్శిస్తుంటారు. నా సినిమాలపై అవగాహన లేకుండానే కామెంట్స్ చేస్తుంటారు’’

సినీ పరిశ్రమకు ఈమె చేస్తోన్న సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

‘కేజీయఫ్‌ 2’లో రమికాసేన్‌గా నటించి దక్షిణాది ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. మరెన్నో సౌత్‌ చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని ఉందన్నారు.

యువతరం నటీనటుల్లో రవీనా టాండన్‌ను అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఈమె అంటే తనకెంతో ఇష్టమని ప్రభాస్‌ ఓ సందర్భంలో చెప్పారు.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home