వాలు కనుల వాలియా.. 

‘మే లక్ష్మీ తేరీ ఆంగాన్‌ కీ’ హిందీ సీరియల్‌తో 2012లో బాలనటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.. రోష్ని వాలియా. 

(Photos: Instagram/Roshni Walia)

‘బాలికా వధు’, ‘భారత్‌ కా వీర్‌ పుత్ర - మహారాణా ప్రతాప్‌’ తదితర సీరియల్స్‌లో నటించి బీటౌన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ 21 ఏళ్ల రోష్ని.. కాస్త బోల్డ్‌గా కనిపిస్తూ సోషల్‌మీడియాలో క్రేజ్‌ సంపాదించుకుంటోంది. ఇన్‌స్టాలో ఈమెకు 3 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

తాజాగా ఈ బ్యూటీ ఓ అవార్డు వేడుకకు సిల్వర్‌ రంగు దుస్తుల్లో హాజరైంది. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

రోష్ని.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సెప్టెంబర్‌ 20, 2001న జన్మించింది. ప్రస్తుతం ముంబయిలో నివసిస్తోంది. 

చిన్నవయసులోనే ఈ భామ పలు టీవీ యాడ్స్‌లో నటించింది. ‘మై ఫ్రెండ్‌ గణేశ’ యానిమేషన్‌ చిత్రంలోనూ బాలనటిగా కనిపించింది. 

ఆ తర్వాతే వరుసపెట్టి సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘కుడి బడి క్యూటీ’ అనే ఓ వీడియో ఆల్బమ్‌లోనూ ఆడిపాడింది. 

‘మచ్లీ జల్‌ కి రాణి హై’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ లిటిల్స్‌’, ‘ఫిరంగీ’, ‘ఐయామ్‌ బాన్నీ’ చిత్రాల్లోనూ టీనేజ్‌ అమ్మాయిగా వివిధ పాత్రలు పోషించింది. 

చివరగా 2019-20 మధ్య ప్రసారమైన ‘తార ఫ్రమ్‌ సితార’లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత రోష్ని.. తెరపై కనిపించలేదు. 

గత మార్చిలో షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో కలిసి ఓ పార్టీలో దిగిన ఫొటోలు ఈ భామ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. అవి కూడా బాగా వైరలయ్యాయి. 

నటనకు దూరంగా ఉన్నా.. పలు అవార్డుల వేడుకలు, ఈవెంట్స్‌లో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home