హైదరాబాద్‌ బ్యూటీ.. అదిరే పోజులు!

సోషల్‌మీడియాలో హీట్‌ పుట్టిస్తోంది.. హైదరాబాద్‌ బ్యూటీ తేజస్వీ మదివాడ. ఇటీవల పొట్టి డ్రెస్‌లో తేజస్వీ దిగిన ఫొటో తెగ వైరలైంది. 

Image: Instagram/Tejaswi Madivada

తాజాగా ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది. ఈ మధ్య ఇన్‌స్టాలో తరచూ ఫొటోలు పోస్టు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 

Image: Instagram/Tejaswi Madivada

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈ సిటీ అందం.. జర్నలిజంలో డిగ్రీ చేసింది. చిన్నప్పట్నుంచీ మంచి డ్యాన్సర్‌. అందుకే, పార్ట్‌టైమ్‌ డ్యాన్స్‌ శిక్షకురాలిగా పనిచేసింది. 

Image: Instagram/Tejaswi Madivada

అందాల పోటీల్లోనూ పాల్గొనడంతో సినిమా అవకాశాలొచ్చాయి. తొలిసారిగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో హీరోయిన్‌ సోదరి పాత్ర పోషించింది. 

Image: Instagram/Tejaswi Madivada

రామ్‌గోపాల్‌ వర్మ ‘ఐస్‌క్రీమ్‌’, ‘కేరింత’, తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా.. తేజస్వీకి ఎక్కువగా సహాయక పాత్రలే వచ్చాయి. 

Image: Instagram/Tejaswi Madivada

అలా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘మిస్టర్‌’ ఇలా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

Image: Instagram/Tejaswi Madivada

వివిధ కారణాలతో 2017 తర్వాత సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత ‘కమిట్‌మెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image: Instagram/Tejaswi Madivada

తెలుగు ‘బిగ్‌బాస్‌’ రెండో సీజన్‌లో మెరిసిన తేజస్వీ.. మరోసారి ‘బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌’షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.

Image: Instagram/Tejaswi Madivada

మూడు నెలల కిందట.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వారితో ‘బీబీ జోడీ’ పేరుతో ఓ డ్యాన్స్‌ షో నిర్వహించారు. ఇందులో తేజస్వీ.. అఖిల్‌ సార్థిక్‌తో కలిసి పాల్గొంది.

Image: Instagram/Tejaswi Madivada

ఇక సోషల్‌మీడియాలోనూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ యంగ్‌ బ్యూటీకి ఇన్‌స్టాలో 1.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/Tejaswi Madivada

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home