అదితి శంకర్‌.. డబుల్‌ ధమాకా!

దిగ్గజ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి.. తెరంగేట్రానికి ముందే మరో అవకాశం దక్కించుకుంది.

Image: Twitter/Aditi Shankar

శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘మావీరన్‌(తెలుగులో మహా వీరుడు)’లో హీరోయిన్‌గా నటించనుంది. ఇది ఆమెకు రెండో చిత్రం.

Image: Twitter/Aditi Shankar

కార్తి నటించిన ‘విరుమన్‌’తో అదితి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కానుంది.

Image: Twitter/Aditi Shankar

‘విరుమన్‌’ విడుదలకు ముందే అదితి.. ‘మావీరన్‌’ ఆఫర్‌ దక్కించుకోవడం విశేషం.

Image: Twitter/Aditi Shankar

చెన్నైలో పుట్టిన అదితికి చిన్నతనం నుంచే నటన, సంగీతంపై ఆసక్తి పెరిగింది.

Image: Twitter/Aditi Shankar

అలా అని.. చదువును అశ్రద్ధ చేయలేదు. చెన్నైలోని ఓ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. గతేడాదే డాక్టర్‌ పట్టా అందుకుంది.

Image: Twitter/Aditi Shankar

డిగ్రీ పూర్తి కావడంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమైంది.

Image: Twitter/Aditi Shankar

‘నా తండ్రి ఉన్న పరిశ్రమలోనే నా కెరీర్‌ మొదలు కావడం గౌరవంగా ఉంది. ఆయన గర్వపడేలా చేస్తా’అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అదితి.

Image: Twitter/Aditi Shankar

కేవలం తమిళ్‌లోనే కాదు.. మంచి కథ దొరికితే ఏ భాషలో నటించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

Image: Twitter/Aditi Shankar

అదితి మంచి గాయని కూడా. వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ‘గని’లో ‘రోమియో జూలియట్‌’ పాట పాడింది తనే. ఈ పాటతోనే నేపథ్య గాయనిగానూ మారింది.

Image: Twitter/Aditi Shankar

‘హలో వరల్డ్‌’ అంటూ వచ్చిన సదా..!

డిప్రెషన్‌ గురించి.. దీపికా పదుకొణె ఏమందో తెలుసా?

టాలీవుడ్‌ చందమామ.. రీఎంట్రీ ఇస్తోందమ్మా..

Eenadu.net Home