పెళ్లిపీటలెక్కనున్న ఐశ్వర్య..!
కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య అర్జున్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది.
Image: Instagram/Aishwarya Arjun
ఈమె ఎవరో కాదు.. ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అర్జున్ కుమార్తె.
Image: Instagram/Aishwarya Arjun
తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో వచ్చే ఏడాది ఈమె వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
Image: Instagram/Aishwarya Arjun
కర్ణాటకలోని బెంగళూరులో పుట్టిన ఐశ్వర్య.. తమిళనాడులోని చెన్నైలో పెరిగింది. స్టెల్లా మేరీస్ కళాశాలలో బి.కామ్ చదువుకుంది.
Image: Instagram/Aishwarya Arjun
డిగ్రీ పూర్తి కాగానే.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది.
Image: Instagram/Aishwarya Arjun
సినిమాలపై ఆసక్తి ఉండటంతో 2013లో విశాల్ నటించిన ‘పట్టాతు యానై’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ధీరుడు’గా డబ్ చేశారు.
Image: Instagram/Aishwarya Arjun
మళ్లీ 2018లో ‘ప్రేమ బరహా’తో కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు.
Image: Instagram/Aishwarya Arjun
ఇటీవల యువ నటుడు విశ్వక్‌సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకున్నారు.
Image: Instagram/Aishwarya Arjun
కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో ఐశ్వర్య టాలీవుడ్ ఎంట్రీ అక్కడే ఆగిపోయింది.
Image: Instagram/Aishwarya Arjun
కుటుంబంపై ఈమెకు ఎంత ప్రేమో. పండగలు, ప్రత్యేక సందర్భాలను తన కుటుంబసభ్యులతో జరుపుకొనేందుకే ఎక్కువ ఇష్టపడుతుంది.
Image: Instagram/Aishwarya Arjun
అర్జున్ తనయ.. సోషల్‌మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు.. కానీ అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది.
Image: Instagram/Aishwarya Arjun