బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.. ఐశ్వర్యా సుస్మిత.

Image: Instagram/Aishwarya Sushmita

తాజాగా బాలీవుడ్‌ దర్శకనిర్మాత నీరజ్‌ పాండే రూపొందించిన ‘ఖాకీ-ది బిహార్‌ చాప్టర్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Image: Instagram/Aishwarya Sushmita

ఐశ్వర్య కేవలం నటే కాదు.. మంచి గాయని, బెల్లీ డ్యాన్సర్‌. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. 

Image: Instagram/Aishwarya Sushmita

బిహార్‌లోని దర్భంగాలో 1994 జులై 12న జన్మించిన ఐశ్వర్య.. పెద్దయ్యాక ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకుందట. 

Image: Instagram/Aishwarya Sushmita

ఈ క్రమంలోనే దిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో పి.జి చేసింది. అయితే, సరదాగా వర్సిటీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె క్యాంపస్‌ ప్రిన్సెస్‌ 2015 కిరీటం గెలుచుకుంది.

Image: Instagram/Aishwarya Sushmita

ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తి ఏర్పడటంతో ముంబయికి వచ్చి మోడలింగ్‌లో శిక్షణ తీసుకుంది. తల్లిదండ్రుల్ని ఒప్పించి మోడలింగ్‌నే తన కెరీర్‌గా ఎంచుకుంది.

Image: Instagram/Aishwarya Sushmita

మిస్‌ నార్త్‌ ఇండియా బ్యూటీ పీజియంట్‌-2016లో పాల్గొని మిస్‌ కాంజినియాలిటీగా నిలిచింది. 

Image: Instagram/Aishwarya Sushmita

ఆ తర్వాత పలు ఫ్యాషన్‌ షోలు, ప్రచార చిత్రాల్లో నటించింది ఐశ్వర్య. వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. 

Image: Instagram/Aishwarya Sushmita

మోడలింగ్‌ చేస్తూనే నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2021లో ‘స్పెషల్‌ ఆప్స్‌ 1.5: ది హమ్మత్‌ స్టోరీ’లో నటించింది. 

Image: Instagram/Aishwarya Sushmita

ఇప్పుడు మరో వెబ్‌సిరీస్‌‘ఖాకీ...’లో బిహారీ మహిళగా కనిపించి మెప్పించింది. 

Image: Instagram/Aishwarya Sushmita

ఈ భామకు దీపికా పదుకొణె, సోనమ్‌ కపూర్‌ నటన అంటే ఇష్టమట.

Image: Instagram/Aishwarya Sushmita

వీలు కుదిరినప్పుడల్లా బ్యాడ్మింటన్‌ ఆడుతుందట. పెయింటింగ్‌, ట్రావెలింగ్‌నూ ఇష్టపడుతుంది.

Image: Instagram/Aishwarya Sushmita

ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఐశ్వర్య.. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటుంది.

Image: Instagram/Aishwarya Sushmita

సోషల్‌మీడియాలో తన హాట్‌ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Aishwarya Sushmita

హాలీవుడ్‌లో భారత సంతతి తారల్ని చూశారా!

ఆహా.. అక్షర అందం!

ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఫొటోషూట్స్‌ చూశారా?

Eenadu.net Home