ఆకాంక్ష పూరి.. బిగ్‌బాస్‌లో చేరి!
బాలీవుడ్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 తాజాగా మొదలైంది. ఇందులో కంటెస్టెంట్‌గా చేరింది నటి ఆకాంక్ష పూరి.
Image: Instagram/Akanksha Puri
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో పుట్టిపెరిగిన ఆకాంక్ష.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూలో పనిచేసింది.
Image: Instagram/Akanksha Puri
ఉద్యోగం చేస్తూనే మోడల్‌గా కొనసాగింది. పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో తన ఫొటోలు ఉండేవి. యాడ్స్‌లోనూ నటించింది.
Image: Instagram/Akanksha Puri
టీవీలో ఆకాంక్ష యాడ్ చూసి కోలీవుడ్ నిర్మాణ సంస్థ ‘గ్రీన్ స్టూడియో’ సినిమా అవకాశం ఇచ్చింది.
Image: Instagram/Akanksha Puri
అలా.. ‘అలెక్స్ పాండియన్(2013)’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ప్రేయిస్ ది లార్డ్’ అనే మలయాళీ చిత్రంతో మాలీవుడ్‌లో, ‘సామ్రాజ్యం 2’తో కన్నడలో మెరిసింది.
Image: Instagram/Akanksha Puri
దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన ‘క్యాలెండర్ గర్ల్స్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.
Image: Instagram/Akanksha Puri
బుల్లితెరపై కూడా ఆకాంక్ష తళుక్కుమంది. విఘ్నహర్త సీరియల్‌లో మాత ఆదిపరాశక్తి పార్వతి పాత్రలో ఆకట్టుకుంది.
Image: Instagram/Akanksha Puri
గతంలో ఈ బ్యూటీ ‘బిగ్‌బాస్’ షోకి రెండుసార్లు వెళ్లింది. అయితే, కంటెస్టెంట్‌గా కాదు. ఒకసారి గెస్ట్‌గా వెళ్లగా.. మరోసారి ఛాలెంజర్‌గా వెళ్లింది.
Image: Instagram/Akanksha Puri
బాలీవుడ్ సింగర్ మికా సింగ్ తన జీవిత భాగస్వామి కోసం నిర్వహించిన రియాల్టీ షో ‘స్వయవర్-మికా ది వోహ్తి’లో పాల్గొని విజేతగా నిలిచింది.
Image: Instagram/Akanksha Puri
సినిమా, టీవీ షోలతోనే కాదు.. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది ఆకాంక్ష. ఇటీవల ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.
Image: Instagram/Akanksha Puri
ఈ భోపాల్ బ్యూటీకి డ్యాన్సింగ్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తన ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్ పారిస్.
Image: Instagram/Akanksha Puri
హీరోల్లో సల్మాన్ ఖాన్, హీరోయిన్లలో దీపికా పదుకొణెకు ఆకాంక్ష వీరాభిమాని.
Image: Instagram/Akanksha Puri
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందానికి ఇన్‌స్టాలో 2.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Akanksha Puri