‘అమరన్‌’ కోసం నిజమైన రైఫిల్స్‌.. ఆసక్తికర విషయాలివే!

తమిళనాడుకు చెందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే ‘అమరన్‌’

శివ్‌ ఆరూర్‌, రాహుల్‌ సింగ్‌ రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌’ ఆధారంగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ కథను డెవలప్‌ చేశారు.

తాను ఇచ్చిన మాట ప్రకారం ఈ మూవీకి నిర్మాతగా మారారు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌.

ముకుంద్‌ పాత్ర కొత్త వ్యక్తితో చేద్దామనుకున్నా, చివరకు శివకార్తికేయన్‌ను ఎంచుకున్నారు. 

జమ్మూ కశ్మీర్‌లోని అత్యంత సున్నితమైన ప్రదేశాల్లో మూడెంచల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.

కొన్ని యాక్షన్‌ సన్నివేశాల కోసం నిజమైన ఏకే-47 గన్స్‌ను ఉపయోగించారు. 

తండ్రి జైల్‌ సూపరెంటెండెంట్‌గా పనిచేసి ఉండటంతో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని, తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్నారు శివకార్తికేయన్‌ 

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సాయి పల్లవి ఇందులో ముకుంద్‌ సతీమణి రెబకా వర్గీస్‌ పాత్రలో నటించారు.

బయోపిక్‌ కోసం శివకార్తికేయన్‌ 80 కిలోల బరువు పెరిగి, మళ్లీ 72 కిలోలకు తగ్గారు. అందుకు తగినట్లు శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home