.
కశ్మీర్‌కు ఉత్తరాన హిమాలయాల్లో స్వయంభూగా వెలిసే మంచులింగ దర్శనం కోసం సాగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైంది.
5 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించాడని పురాణాల కథనం.
ఓసారి పార్వతి అమరత్వం గురించి శివుణ్ని అడగగా.. ఆయన వేరెవరూ వినకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలోనే వివరించాడని ప్రతీతి.
15వ శతాబ్దంలో ఓ గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కున్నాడు. అప్పటి నుంచీ ఈ క్షేత్రానికి శివలింగ దర్శనార్థమై భక్తులు రావడం ప్రారంభమైంది.
గుహమీదుగా జారే నీటి బొట్లు లింగాకారంగా మారతాయి. వేసవి ముగిశాకే ఈ శివలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ ఏడాదికి నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.
ఈ యాత్ర చేయాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాలి. రాళ్లల్లో, గుట్టల్లో నడక అతి కష్టం మీద సాగుతుంది. చాలా మంది డోలీలపై, గుర్రాలపై ప్రయాణం చేస్తారు.
అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ యాత్రకు రెండు మార్గాలు. పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి.. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. ఇది శివుడు నడిచి వెళ్లిన దారని భావిస్తారు
శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు చేరుకుని అక్కడి నుంచి14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు వెళ్లడం మరొక దారి.
అమర్‌నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై రాఖీ పౌర్ణమిన ముగుస్తుంది. ఈ ఏడాది జూన్ 29న మొదలై ఆగస్టు 31న ముగియనుంది.
అమర్‌నాథ్ యాత్ర చేయడం వల్ల 23 తీర్థయాత్రలు పూర్తి చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం