అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలు!

అమర్‌నాథ్‌ జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న పవిత్ర ప్రాంతం. ఇక్కడ శివుడు.. మంచు లింగం రూపంలో దర్శనమిస్తాడు.

Source: RKC

గందర్భల్‌ జిల్లాలో అమర్‌నాథ్‌ పర్వతంపై 17వేల అడుగులకు పైగా ఎత్తులో ఈ గుహ ఉంటుంది. శ్రీనగర్‌కు 141కి.మీ. దూరం ఉంటుంది.

Source: RKC

మంచు నుంచి శివలింగం ఏర్పడటం వల్ల దీన్ని ‘బాబా బర్ఫానీ’ అని పిలుస్తారు. వేసవిలో కొన్ని రోజులు మినహా ఏడాదంతా ఈ గుహ మంచుతో కప్పి ఉంటుంది.

Source: RKC

గుహ పైనుంచి పడుతున్ననీటి బిందువుల వల్ల మంచు శివలింగం ఏర్పడుతుంది. ఏటా ఈ శివలింగాన్ని చూడటానికి లక్షల మంది వెళతారు.

Source: RKC

శ్రావణ శుక్ల పౌర్ణమి నాటికి శివలింగం పూర్తిగా ఏర్పడి.. ఆ తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం తగ్గుతుంది.

Source: RKC

ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 4వేల మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల కాలి నడకన లేదా పోనీల(గుర్రాలు)పై, డోలీలపై చేరుకోవాలి.

Source: RKC

పార్వతీ దేవీ అమరత్వం గురించి శివుడిని అడగ్గా.. ఆయన దాన్ని ఆమెకు ఈ ప్రాంతంలో వివరించాడని ప్రతీతి. అందుకే అమర్‌నాథ్‌ గుహకు ఆ పేరు వచ్చినట్లు చెబుతారు.

Source: RKC

ఆధునిక పరిశోధనల ప్రకారం 1850లో బూటా మాలిక్‌ అనే ముస్లిం గొర్రెల కాపరి అమర్‌నాథ్‌ గుహను కనుగొన్నాడని అంటారు.

Source: RKC

ఏటా జులై- ఆగస్టులో అమర్‌నాథ్‌ యాత్ర జరుగుతుంది. 2004 నుంచి యాత్రను 2 నెలలు నిర్వహించాలని శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు నిర్ణయించింది.

Source: RKC

అమర్‌నాథ్‌ గుహను చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.

Source: RKC

మొదటి మార్గం.. పెహల్గామ్‌ నుంచి వెళ్లొచ్చు. దాదాపు 50కి.మీ. దూరం ఉంటుంది. ఐదు రోజులు పడుతుంది.

Source: RKC

రెండోది బాల్టల్‌ నుంచి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి గుహ దూరం 16కి.మీ. ఈ ప్రాంతం నిటారుగా ఉంటుంది. రెండు రోజుల సమయం పడుతుంది.

Source: RKC

అమర్‌నాథ్ యాత్ర కోసం శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB)అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

Source: RKC

13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీలను యాత్రకు అనుమతించరు.

Source: RKC

ఈ వారం రాశిఫలం

హనుమాన్‌ ఆలయానికి ఎస్కలేటర్‌

అల్లుడి కాళ్లెందుకు కడుగుతారో తెలుసా?

Eenadu.net Home