అంబాజీపేట శివాని

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’తో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.. శివాని నగారం. తాజాగా ఈ సినిమా ప్రేక్షకులముందుకొచ్చింది.  

దుశ్యంత్‌ కటికినేని తెరకెక్కించిన ఈ చిత్రంలో సుహాస్‌ హీరోగా నటించగా.. శివాని ‘లక్ష్మి’ పాత్రలో ఆకట్టుకుంది.

ఈ భామ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. విల్లా మేరీ డిగ్రీ కాలేజీలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకుంది.

అంతర్గత’ అనే లఘుచిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత ‘మిస్టర్‌ గర్ల్‌ఫ్రెండ్’(2020) అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

ఇన్‌స్టా ద్వారా ఈ సినిమాలో అవకాశం ఉందని తెలిసి స్నేహితురాలి పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చిందట. కానీ తననే నాయికగా ఎంపిక చేశారు.

‘నేనే హీరోయిన్‌ని అని టీమ్‌ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. జోక్‌ చేస్తున్నారేమో అనుకున్నా.. కానీ మొదటి రోజు షూట్‌లో పాల్గొన్నాక నమ్మకం వచ్చింది’ అని ఓ ఇంటర్వూలో తెలిపింది.

‘‘డైలాగులు ముందే ప్రాక్టీస్‌ చేయడం వల్ల సెట్‌లో అంత ఇబ్బంది ఎదురవ్వలేదు. పని గురించి భయపడటం మానేసి దాన్ని తేలికగా ఎలా చేయొచ్చో అలోచిస్తే పరిష్కారం దొరికినట్టే..’’ అంటోంది. 

This browser does not support the video element.

ఇంటి వద్ద పిల్లలకు డ్యాన్స్‌తో పాటు సంగీతం నేర్పిస్తుంటుంది. శివాని సోదరుడు గిటార్‌ వాయిస్తుండగా తను పాటలు పాడుతూ.. ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.

తను నటించే సినిమాలో ఓ పాట పాడాలని, డ్యాన్స్‌ చేయాలనే కోరిక ఉందట. కానీ ‘అంబాజీపేట...’లో అది కుదరలేదని, ఇంకోసారి తప్పకుండా ప్రయత్నిస్తానని చెబుతుందీ భామ.

హీరోయిన్‌ పాత్రలే చేయాలని అనుకోవట్లేదట. పాత్రకి మంచి గుర్తింపు ఉండి, బలమైన కథయితే.. ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే అంటుంది శివాని.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home