అనన్య సౌందర్యం..
‘మల్లేశం’తో వెండితెరకు పరిచయమైన నటి అనన్య నాగళ్ల.
Image: Instagram/Ananya nagalla
పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ భామ.. సోషల్‌మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసి నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది.
Image: Instagram/Ananya nagalla
ఇటీవల తను బ్లౌజ్‌లెస్ నలుపు చీరలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. 1.30లక్షల లైకులు వచ్చాయి.
Image: Instagram/Ananya nagalla
ఇదే కాదు.. అప్పుడప్పుడు అనన్య గ్లామర్ డోస్ పెంచుతూ.. కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
Image: Instagram/Ananya nagalla
ఇక తన వ్యక్తిగత విషయాలకొస్తే.. 1987లో తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది.
Image: Instagram/Ananya nagalla
అనన్య కుటుంబమంతా ఈమె చదువుల కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది.
Image: Instagram/Ananya nagalla
నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్ పూర్తి చేసి.. ఇన్ఫోసిస్‌లో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేసింది.
Image: Instagram/Ananya nagalla
ఆ సమయంలోనే ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. ఉత్తమ నటిగా ‘సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డు’కు నామినేటైంది.
Image: Instagram/Ananya nagalla
‘మల్లేశం’ కోసం ఆడిషన్ ఇవ్వగా హీరోయిన్‌గా ఎంపికైంది. అందులో ప్రియదర్శికి జోడీగా నటించింది.
Image: Instagram/Ananya nagalla
ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’, ‘మాస్ట్రో’, ‘వకీల్ సాబ్’ చిత్రాల్లో నటించింది. ‘ఊర్వశివో.. రాక్షసివో’లో అతిథిగా మెరిసింది.
Image: Instagram/Ananya nagalla
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘శాకుంతలం’లోనూ ప్రియంవద అనే పాత్రలో కనిపించనుంది.
Image: Instagram/Ananya nagalla
This browser does not support the video element.
సినిమా అవకాశాలు వస్తున్నా.. ప్రేక్షకులు కుటుంబసమేతంగా చూడగలిగేలా తన సినిమాలు ఉండాలని కథల్ని ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Image: Instagram/Ananya nagalla
ఈ భామ.. ఓ అగ్ర నిర్మాత కుమారుడిని వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని అనన్య ఖండించింది.
Image: Instagram/Ananya nagalla