యూట్యూబర్‌.. ఇప్పుడు హీరోయిన్‌

‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌తో తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన నటి.. అనన్య శర్మ. యువతలో తనకున్న క్రేజ్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయి. 

Image: Instagram/Ananya

తాజాగా ఈ బ్యూటీ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్‌గా నటించింది. జూన్‌ 30న ఈ సిరీస్‌ ‘ఆహా’లో విడుదలకానుంది. 

Image: Instagram/Ananya

క్యూట్‌గా.. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ అందాల సుందరి.. వరంగల్‌లో పుట్టింది. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదువుకుంది.

Image: Instagram/Ananya

పదో తరగతి బెంగళూరులో, ఇంటర్‌ హైదరాబాద్‌లో, చెన్నైలోని వీఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. 

Image: Instagram/Ananya

చిన్నప్పట్నుంచీ నటనపై ఆసక్తి ఉన్నా.. ఎప్పుడూ నటించాలని అనుకోలేదట. కానీ, డిగ్రీలో ఉన్నప్పుడు యూట్యూబ్‌ షార్ట్‌ఫిల్మ్స్‌లో అవకాశం రావడంతో నటనవైపు అడుగులేసింది.

Image: Instagram/Ananya 

అలా.. తొలిసారి ‘బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ టేల్స్‌’తో నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. ‘ఫ్లాట్‌మేట్స్‌’, ‘థింగ్స్‌ బ్యాచ్‌ ఆఫ్‌ 2020 గ్రాడ్యుయేట్స్‌..’, ‘జాతిరత్నాలు అమ్మాయిలైతే’ తదితర షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది. 

Image: Instagram/Ananya

ఇక చైతన్య రావ్‌తో కలిసి నటించిన ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో అనన్య ఫేమసైపోయింది. ఇందులో తన నటనకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. 

Image: Instagram/Ananya

చైతన్య, అనన్య జోడీకి ఫ్యాన్స్‌ పెరిగారు. దీంతో వారిద్దరూ కలిసి వివిధ టెలివిజన్‌ షోల్లో సందడి చేశారు.

Image: Instagram/Ananya

ఈ మధ్య యంగ్‌ హీరో/డైరెక్టర్‌ సుమంత్‌ ప్రభాస్‌తో కలిసి అనన్య ‘మైరా’ పేరుతో ఓ వీడియో సాంగ్‌ చేసింది.

Image: Instagram/Ananya

అంతకుముందు సుధాకర్‌తో కలిసి ‘లాలిపాప్‌’ పేరుతో ఓ పాన్‌ ఇండియా మ్యూజిక్‌ వీడియోలో మెరిసింది.

Image: Instagram/Ananya

‘30 వెడ్స్‌ 21’లో ప్రధాన పాత్ర పోషించిన చైతన్య రావ్‌ హీరోగా ఓ సినిమా చేస్తుండగా.. అనన్య ఇప్పటికే ‘అర్థమైందా అరుణ్‌కుమార్‌’తో హీరోయిన్‌గా మారిపోయింది. ఈమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులూ ఉన్నాయి. 

Image: Instagram/Ananya

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home