ఆల్‌ ఇన్‌ వన్‌ అనసూయ..

వెండి తెర, బుల్లి తెరపై భాషతో సంబంధం లేకుండా తన ప్రతిభతో దూసుకెళ్తోంది.. నటి అనసూయ. ప్రస్తుతం ‘పుష్ప 2’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాగ(2003)’తో తొలిసారి తెరపై కనిపించింది. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసింది.. ఆ తర్వాత ఓ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసింది. 

ఇక ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో యాంకర్‌గా మారిన తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దాంతోపాటు పలు షోలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని, అభిమానుల్ని సంపాదించుకుంది. 

‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగార్జునకు మరదలుగా నటించి మార్కులు కొట్టేసింది. అప్పటి నుంచీ వెండితెరపై వరుస అవకాశాలతో రాణిస్తోంది.

సినిమాల్లో పాత్రలతో పాటు.. ‘విన్నర్‌’, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘చావు కబురు చల్లగా’ తదితర చిత్రాల్లో ప్రత్యేక పాటల్లోనూ మెరిసింది.

అనసూయ కెరీర్ ‘రంగస్థలం’కి ముందో లెక్క తర్వాత ఓ లెక్క లాగా సాగింది. ఈ చిత్రంతో అభిమానుల గుండెల్లో ‘రంగమ్మత్త’గా ముద్ర వేసుకుంది.

ఇటీవల ‘రజాకార్‌’లో పోచమ్మగా మెప్పించింది. ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘ప్రేమ విమానం’, ‘పెదకాపు 1’ తదితర చిత్రాల్లో నటించి అలరించింది.

 ‘పుష్ప 1’లో విలన్‌ దాక్షాయనిగా అనసూయ నటించిన తీరుకు మంచి గుర్తింపు లభించింది. ‘పుష్ప 2’లో ఆమె పాత్రకి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతోంది. మలయాళంలో ‘భీష్మపర్వం’తో ఆకట్టుకుంది. తమిళంలో ‘ఫ్లాష్‌బ్యాక్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. 

అనసూయకి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఏదైనా ఫొటో పెడితే నిమిషాల్లో అది వైరల్‌ అవుతుంటుంది. ఇన్‌స్టాలో తనని 15లక్షల మంది ఫాలో అవుతున్నారు.

కుటుంబంతో కలసి ఎక్కువగా విహారయాత్రలకు వెళుతుంది. అనసూయకి దైవభక్తి ఎక్కువ. సంప్రదాయ పండగలను ఘనంగా నిర్వహిస్తుంటుంది.

స్టెప్పులతో అదరగొడుతున్న శ్రష్టి వర్మ..

సమ్మర్‌ సొగసులు

‘హీరామండి’తో ఆ కోరిక తీరింది

Eenadu.net Home